
జెంటిల్‌మెన్ పాటకు స్టెప్పులు:
తాజాగా కెవిన్ పీటర్సన్ 1993లో 'యాక్షన్ కింగ్' అర్జున్ నటించిన జెంటిల్‌మెన్ తమిళ చిత్రంలోని ఒట్టగత్తై కట్టికో (కొంటెగాడ్ని కట్టుకో) పాటకు టిక్‌టాక్ వీడియో చేసాడు. అర్జున్ పాటకు పీటర్సన్ తనదైన స్టెప్పులు వేసాడు. తల, చేతులు ఊపుతూ గమ్మత్తుగా చేసాడు. ఈ వీడియోను నెట్టింట్లో పోస్ట్ చేయగా.. అది చూసిన జెంటిల్‌మెన్ చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దీంతో పీటర్సన్ డాన్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

మహేశ్ పంచ్ డైలాగ్:
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ వరుస టిక్‌టాక్‌లతో దుమ్మలేపుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వార్నర్ తెలుగు సినిమాల పాటలు, డైలాగులకు ఫిదా అవుతున్నాడు. అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' సినిమాలోని 'బుట్టబొమ్మ' పాటకు తన సతీమణితో కలిసి డ్యాన్స్ చేయడమే కాకుండా.. పోకిరి సినిమాలోని మహేశ్‌బాబు పంచ్ డైలాగ్‌ను కూడా అనుకరించి తెలుగు అభిమానులకు మరింత చేరువయ్యాడు. లాక్‌డౌన్ వేళ చాలా మంది ఆటగాళ్లు లైవ్‌చాట్ సెషన్లు నిర్వహిస్తూ గత స్మృతులను నెమరువేసుకుంటున్నారు. పీటర్సన్ కూడా గతనెల భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో చాట్ చేసి అనేక విషయాలపై ముచ్చటించాడు.

3 టెస్టులు, 10 వన్డేలకు నాయకత్వం:
2013-14 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ 0-5 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం తర్వాత కెవిన్ పీటర్సన్ ఇంగ్లండ్ జట్టులో చోటు కోల్పోయాడు. 2012లో అప్పటి కెప్టెన్ ఆండ్రు స్ట్రాస్, కోచ్ ఆండీ ఫ్లవర్‌ను విమర్శిస్తూ దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు పీటర్సన్ సందేశాలు పంపాడన్న ఆరోపణలు అతడిపై వేటు వేసేందుకు మరో కారణం. 2008లో పీటర్సన్ ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మూడు టెస్టులు, 10 వన్డేలలో జట్టుకు నాయకత్వం వహించాడు.
104 టెస్టులు.. 136 వన్డేలు:
దక్షిణాఫ్రికా సంతతికి చెందిన కెవిన్ పీటర్సన్ ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడి సక్సెస్ అయ్యాడు. 104 టెస్టుల్లో 8,181 పరుగులు చేయగా.. 136 వన్డేల్లో 4,440 పరుగులు చేశాడు. ఇక 37 టీ20ల్లో 1,176 రన్స్ చేసాడు. టెస్టుల్లో 23, వన్డేల్లో 9 సెంచరీలు చేసాడు. క్రికెట్ నుంచి తప్పుకున్నాక పీటర్సన్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications












