ఒక్కో రన్ కు ఒక్కో కోటి రూపాయలు
ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ బ్యాటింగ్ తీరు తీవ్ర విమర్శల పాలవుతోంది. ఈ సీజన్ లో 25.20 కోట్ల రూపాయలతో అతన్ని జట్టులోకి తీసుకుంది కోల్ కత నైట్ రైడర్స్. ఇప్పటివరకు ఆడిన మూడింట్లోనూ అతను విఫలం అయ్యాడు. మూడు మ్యాచ్‌లలో 24 పరుగులు మాత్రమే చేశాడు. అతడిని స్పెషలిస్ట్ బ్యాటర్‌గా కొనసాగించాలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
క్రికెట్ ఆస్ట్రేలియా పర్యవేక్షణలో ఉన్న వెన్ను నొప్పి సమస్యల కారణంగా గ్రీన్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో బౌలింగ్ చేయడం లేదు. ఇది కేకేఆర్ జట్టు సమతుల్యతను దెబ్బతీసింది. బలహీనమైన బౌలింగ్ విభాగాన్ని ఉపయోగించాల్సి వస్తోంది. గ్రీన్ ఎప్పుడు బౌలింగ్ ప్రారంభిస్తాడనే దానిపై స్పష్టత లేదు. దీంతో అతన్ని కేకేఆర్ తుది జట్టు నుండి తొలగించాలని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ డిమాండ్ చేశాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి గ్రీన్ సరిపోడని అభిప్రాయపడ్డారు.

జియోహాట్‌స్టార్‌లో పీటర్సన్ మాట్లాడాడు. అతనికి ఫ్రాంఛైజీ చెల్లించే డబ్బు గురించి మాట్లాడటానికి తాను వ్యతిరేకమని, అతని బ్యాటింగ్ సామర్థ్యం గురించే ప్రశ్నిస్తోన్నానని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ వంటి పరుగుల జాతర వంటి టోర్నమెంట్ లో బ్యాటింగ్ ఆర్డర్ లో కామెరాన్ గ్రీన్ మూడో స్థానంలో రావడం సరికాదని చెప్పాడు. కీలకమైన స్థానంలో బ్యాటింగ్ కు దిగాలంటే ఓ మంచి స్పెషలిస్ట్ ప్లేయర్ అయి ఉండాలని అన్నాడు.
బ్యాటింగ్ ఆర్డర్ లో మూడో నంబర్‌లో రావడానికి గ్రీన్ సరిపోడని తాను భావిస్తున్నానని, పైగా అతను బౌలింగ్ కూడా చేయట్లేదని కెవిన్ పీటర్సన్ గుర్తు చేశాడు. ముంబైలో అప్పుడెప్పుడో ఓ సెంచరీ చేశాడనే కారణంతో మూడో స్థానంలో బ్యాటింగ్ కు పంపించడం, ఆ బాధ్యతను మోయడానికి సరిపడా ప్రదర్శన కామెరూన్ గ్రీన్ నుండి రావడం ఇప్పటివరకు చూడలేదని అన్నాడు. కామెరాన్ ఓ సాధారణ మిడిల్ ఆర్డర్ బ్యాటర్, అప్పుడప్పుడు బౌలింగ్ చేస్తాడంతే నని తేల్చి చెప్పాడు.
మాజీ ఆల్‌రౌండర్ సంజయ్ బంగర్ కూడా ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రీన్ స్థానంలో రోమన్ పావెల్‌ను కేకేఆర్ జట్టులోకి తీసుకోమని సూచించారు. గ్రీన్ కు ప్రత్యామ్నాయంగా పావెల్ గురించి జట్టు ఆలోచించడం మంచిదని, అతను ప్రూవ్డ్ టీ20 స్పెషలిస్ట్ అని వ్యాఖ్యానించాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మొదటి మూడు మ్యాచ్‌లలో గెలుపు రుచి చూడలేదు. మూడుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన కేకేఆర్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి పాలైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications