Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Prithvi Shaw: సర్ఫరాజ్‌ను చూసి నేర్చుకో.. పృథ్వీ షాకు మాజీ దిగ్గజం సలహా

Sarfaraz Khan-Prithvi Shaw: టీమిండియా నుంచి సర్ఫరాజ్ ఖాన్ ప్రస్తుతం దూరంగా ఉన్నాడు. ఇంగ్లాండ్ పర్యటనకు సర్ఫరాజ్ ఖాన్‌ను ఇండియా-ఏ జట్టులోకి తీసుకున్నారు. దీంతో అతడిని సీనియర్ జట్టులోకి కూడా తీసుకుంటారని ఆశించారు. కానీ అది జరగలేదు. సర్ఫరాజ్ ఇంగ్లాండ్‌తోనే టీమిండియా తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. అయితే సర్ఫరాజ్ ఫిట్‌నెస్‌పై చాలా సార్లు ప్రశ్నలు తలెత్తాయి. కానీ ఇప్పుడు సర్ఫరాజ్ కఠోరంగా శ్రమించి 17 కిలోల బరువు తగ్గడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సర్ఫరాజ్ ఖాన్ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అదే సమయంలో ఇంగ్లాండ్ మాజీ దిగ్గజం కెవిన్ పీటర్సన్ పృథ్వీ షాకు సలహా ఇచ్చారు.

పృథ్వీ షాకు పీటర్సన్ సలహా
భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ బరువు తగ్గి స్లిమ్‌గా మారడంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పీటర్సన్ సర్ఫరాజ్‌ను ప్రశంసించగా.. పృథ్వీషాను విమర్శించారు. సర్ఫరాజ్ సన్నగా మారడంపై సంతోషం వ్యక్తం చేసిన పీటర్సన్.. ఫెట్‌నెస్ సమస్యలతో జాతీయ జట్టులో చోటు కోల్పోయిన యువ బ్యాటర్ పృథ్వీ షా విషయాన్ని ప్రస్తావించాడు. సర్ఫరాజ్ ఖాన్ ఎలా స్లిమ్‌గా మారాడో పృథ్వీ షాకు చూపించాలని కోరాడు.

Kevin Pietersen advises Prithvi Shaw to follow Sarfaraz Khan s fitness journey

కెవిన్ పీటర్సన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.."అద్భుతమైన ప్రయత్నం సర్ఫరాజ్ ఖాన్. నీకు హృదయపూర్వక అభినందనలు. ఇది ఇప్పుడు నీకు నిరంతరం అద్భుతమైన ప్రదర్శన చేయడంలో సహాయపడుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మళ్లీ జాతీయ జట్టుకు ఆడాలనే సంకల్పంతో నువ్వు కష్టపడుతున్న తీరు నాకు చాలా నచ్చింది. సర్ఫరాజ్ సన్నగా మారిన విషయాన్ని ఎవరైనా పృథ్వీ షాకు చూపించండి. ధృడమైన శరీరంలోనే ధృడమైన మనసు ఉంటుంది." అని కెవిన్ పీటర్సన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు.

నిజానికి పృథ్వీ షా ఫిట్‌నెస్‌పై తరచుగా ప్రశ్నలు తలెత్తుతాయి. దీని కారణంగా పృథ్వీ శాకు జట్టులో ఎక్కువగా అవకాశాలు లభించలేదు. పేలవమైన ఫిట్‌నెస్‌ పృథ్వీషా ప్రదర్శనపై స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సారి ఐపీఎల్ 2025లో ఈ ఆటగాడిని ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు. కొన్ని చెడు అలవాట్ల కారణంగా పృథ్వీ షా ఫిట్‌నెస్‌పై పెద్దగా దృష్టి పెట్టలేదు. పృథ్వీ షా కెప్టెన్సీలో అండర్-19 టీమిండియా జట్టు ప్రపంచ కప్ కూడా గెలుచుకుంది. ఆ తర్వాత 2018లో పృథ్వీ షాకు టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశం లభించింది.

తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే పృథ్వీ షా సెంచరీ చేసి సంచలనం సృష్టించారు. ఈ ఆటగాడిని దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్‌తో పోల్చారు. కానీ పృథ్వీషా అద్భుతమైన ప్రదర్శన ఎక్కువ కాలం కొనసాగలేదు. పేలవమైన ఫిట్‌నెస్ అతని ప్రదర్శనపై పడిన ప్రభావం కారణంగా పృథ్వీని టీమిండియా నుంచి తొలగించారు. 2021లో పృథ్వీ షా తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. అప్పటి నుంచి ఈ ఆటగాడు టీమిండియాలోకి తిరిగి రాలేదు.

Story first published: Tuesday, July 22, 2025, 9:36 [IST]
Other articles published on Jul 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+