స్పిన్ ఆడటం నేర్చుకోండి, లేదంటే భారత పర్యటన వెళ్లొద్దు: ఆసీస్‌కు పీటర్సన్
హైదరాబాద్: స్పిన్ బౌలింగ్ ఆడటం వేగంగా నేర్చుకోండి.. అది సాధ్యం కాకపోతే భారత పర్యటనకు వెళ్లకపోవడమే మంచిదని ఆస్ట్రేలియా జట్టుకు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ సలహా ఇచ్చాడు. భారత పర్యటకను వచ్చిన ఇంగ్లాండ్ జట్టుకు ఎదురైన ఘోర పరాభవం నేపథ్యంలో త్వరలో భారత పర్యటనకు రానున్న ఆసీస్‌కు ఓ హెచ్చరికను పంపాడు.
నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఫిబ్రవరి 23న పూణెలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో పీటర్సన్ మాట్లాడుతూ భారత్ పర్యటనకు వెళ్లి ఆడాలంటే స్పిన్‌ను ఎదుర్కొనేందుకు కఠినంగా ప్రాక్టీస్ చేయాల్సిందేనని హెచ్చరించాడు.

స్పిన్ ఆడడం నేర్చుకోండి... లేకపోతే భారత్‌కు వెళ్లొద్దు
‘వీలైనంత త్వరగా స్పిన్ ఆడడం నేర్చుకోండి. ఒకవేళ మీరు స్పిన్ ఆడలేకపోతే ఈ సిరీస్ కోసం భారత్‌కు వెళ్లొద్దు' అని ఆస్ట్రేలియా జట్టుకు పీటర్సన్ సూచించాడు. ‘భారత్‌కు వెళ్తే ప్రాక్టీస్‌కు కొద్ది సమయమే లభిస్తుంది. అదేదో ఇక్కడే ప్రాక్టీస్ చేసుకోండి. స్పిన్‌ను ఎదుర్కొనేందుకు స్లో పిచ్‌లే ఉండాల్సిన పనిలేదు. ఎలాంటి వికెట్లపైనైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. స్పిన్ లైన్ అండ్ లెంగ్త్‌ను ఎదుర్కోవడం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఫ్రంట్ ఫుట్‌పై ఆడడం నేర్చుకోవాల్సి ఉంటుంది' అని పీటర్సన్ అన్నాడు.

ఫ్రంట్ ఫుట్‌పై ఆడటమే ప్రధాన తప్పిదం
‘భారత పిచ్‌లపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆటగాళ్లు చేసే ప్రధాన తప్పిదం ఫ్రంట్ ఫుట్‌పై ఆడటం. అలా చేస్తే ఇబ్బందులు తప్పవు. బంతి కోసం వేచిచూడటం ఉత్తమ మార్గం. బంతి ఎలా వస్తుందని చూసుకునేందుకు చాలా సమయం ఉంటుంది. పేస్ బౌలింగ్‌లో 150 కిలోమీటర్ల వేగంగా వచ్చే బంతులను మంచి స్థితిలోకి వెళ్లి ఆడుతున్నప్పుడు 50 మైళ్ల వేగంతో వచ్చే స్పిన్ బంతిని ఎదుర్కోవడం కష్టమేం కాదు' అని పీటర్సన్ వివరించాడు.

భారతలో ఆడేందుకు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు
'భారత పర్యటనలో ఆడేందుకు నేను ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. పరుగులు సాధించడమే లక్ష్యంగా ఉన్నా. ప్రతి సింగిల్ బంతిని బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించా. అందుకు ప్రత్యేకంగా తానేమీ సిద్ధం కాలేదు. పరిస్థితులకు తగ్గట్టుగా నా ఫుట్‌వర్క్ మారిందంతే'' అని పీటర్సన్ వివరించాడు.

2012 ఇంగ్లాండ్ విజయంలో పీటర్సన్ కీలకపాత్ర
2012లో భారత్‌లో ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ సాధించడంలో కెవిన్ పీటర్సన్ కీలకపాత్ర పోషించాడు. అప్పటి సిరిస్‌లో పీటర్సన్ 48.29 యావరేజితో అతడు 338 పరుగులు చేశాడు. మరోవైపు భారత ఉపఖండంలో ఆస్ట్రేలియా రికార్డు ఏమంత గొప్పగా లేదు. 2004 తర్వాత ఆస్ట్రేలియా ఇక్కడ 20 టెస్టులాడితే అందులో మూడింటిలో మాత్రమే విజయం సాధించింది.

2004 తర్వాత భారత పర్యటనలో గెలవని ఆస్ట్రేలియా
అందులో రెండు బంగ్లాదేశ్‌పై ఉండటం విశేషం. ప్రస్తుత భారత పర్యటనకు వస్తున్న ఆస్ట్రేలియా జట్టులో కేవలం ఇద్దరు మాత్రమే గతంలో భారత్‌లో ఆడిన అనుభవం ఉన్న వారున్నారు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన సిరిస్‌లో ఆస్ట్రేలియా 0-3తో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ సిరిస్ మొత్తంలో కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో పాటు షాన్ మార్ష్ మాత్రమే 60కి పైగా పరుగులు చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications