Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హార్దిక్ కోసం గంభీర్-పీటర్సన్ గొడవ: ముదురుతున్న వివాదం (Video)

ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యకు మద్దతు ఇస్తూ గౌతమ్ గంభీర్ తనపై చేసిన ఘాటు వ్యాఖ్యలకు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ స్పందించాడు. గంభీర్ చెప్పింది అక్షరాలా నిజమే అని, తానొక చెత్త కెప్టెన్ అంటూ పీటర్సన్ ఒప్పుకున్నాడు. దీంతో హార్దిక్ కారణంగా గంభీర్-పీటర్సన్ మధ్య వివాదం ముదురుతోంది. అసలేం జరిగిందంటే..

ట్రేడింగ్‌లో హార్దిక్ గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు వచ్చిన విషయం తెలిసిందే. అంతేగాక రోహిత్ శర్మ స్థానంలో ముంబై జట్టు పగ్గాలు అందుకున్నాడు. కానీ ముంబైను ప్లేఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు. దీంతో హార్దిక్‌పై కొందరు అభిమానులతో పాటు కొందరు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. అందులో కెవిన్ పీటర్సన్‌తో పాటు దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కూడా ఉన్నాడు.

Kevin Pietersen Acknowledges Gambhir s Critique Yes I Was a Terrible Captain

అయితే హార్దిక్‌ను విమర్శిస్తున్న వాళ్లపై గంభీర్ స్పందించాడు. అంతేగాక పీటర్సన్, డివిలియర్స్ పేర్లను ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ''విమర్శకులు తరుచూ ఏదో ఒకటి చెబుతుంటారని, వాళ్ల పనే అది. జట్టు ప్రదర్శన ఆధారంగా కెప్టెన్సీ గురించి విశ్లేషించాలి. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ మెరుగైన ప్రదర్శన చేసి ఉంటే సీన్ మరోలా ఉండేది. హార్దిక్‌ను ప్రశింసిచేవారు''

''ముందుగా.. హార్దిక్ గుజరాత్ నుంచి ముంబై గూటికి ఈ సీజన్‌లోనే చేరుకున్నాడని గుర్తుంచుకోండి. అతని కాస్త సమయం ఇవ్వాలి. అంతేకానీ, ప్రతి రోజు, ప్రతి మ్యాచ్, ప్రతి షాట్‌ను జడ్జ్ చేయడం సరికాదు. హార్దిక్‌ను విమర్శించే ఏబీ డివిలియర్స్, కెవిన్ పీటర్సన్ కెప్టెన్సీ రికార్డు ఎలా ఉంది? వాళ్లు సారథిగా ఏం గొప్పలు సాధించారు? ఇతర కెప్టెన్ల కంటే చెత్త రికార్డు కలిగి ఉన్నారు'' అని గంభీర్ అన్నాడు.

దీనికి పీటర్సన్ ట్విటర్ వేదికగా రియాక్ట్ అయ్యాడు. గంభీర్ విమర్శించిన వీడియోకు పీటర్సన్ రిప్లై ఇచ్చాడు. 'గంభీర్ చెప్పిన విషయంలో తప్పు లేదు, నేను భయంకరమైన కెప్టెన్‌' అని పీటర్సన్ పేర్కొన్నాడు. కాగా, ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో నాకౌటైన తొలి జట్టుగా ముంబై నిలిచింది.

Story first published: Wednesday, May 15, 2024, 18:14 [IST]
Other articles published on May 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+