Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్మిత్ సెగ తగ్గిపోయిందా..,? విజయానికి దూరంగా దక్షిణాఫ్రికా

 Keshav Maharaj proves left is right against Steve Smith, exposes minor chink in visiting captain's armour

హైదరాబాద్: ఇటీవల జరిగిన టెస్టుల్లో డబుల్ సెంచరీకి పైగా పరుగులు చేసి ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో తొలి స్థానం సంపాదించుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్టీవ్ స్మిత్ ర్యాంకు పడిపోయిందా...? దక్షిణాఫ్రికాకు ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో సాధారణ పరుగులు చేయడమే ఇందుకు కారణం.

స్మిత్‌కు సౌతాఫ్రికా గడ్డపై చేదు అనుభవం ఎదురైంది. సఫారీలతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ యావరేజ్ తగ్గిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 114 బంతులు ఆడిన స్మిత్ 11 ఫోర్లతో 56 పరుగులు చేశాడు. కానీ గత ఐదు ఇన్నింగ్స్‌లో ఇది స్మిత్ చేసిన అతి తక్కువ స్కోర్ కావడంతో అతని యావరేజ్ 63.75 నుంచి 63.67కి పడిపోయింది. గత నాలుగు ఇన్నింగ్స్‌లో స్మిత్ 239, 102(నాటౌట్), 76, 83 పరుగులు చేశాడు.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 225/5తో శుక్రవారం ఉదయం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌.. ఇంకో 126 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. 32 పరుగులతో బ్యాటింగ్‌ కొనసాగించిన మిచెల్‌ మార్ష్‌ (96) విలువైన ఇన్నింగ్స్‌ ఆడటంతో ఆసీస్‌ అనుకున్న దాని కంటే ఎక్కువ స్కోరే చేయగలిగింది. తొమ్మిదో స్థానంలో వచ్చిన మిచెల్‌ స్టార్క్‌ (35) ఉన్నంతసేపూ సఫారీ బౌలర్లపై ఎదురుదాడి చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

స్టార్క్‌ ఔటయ్యాక కూడా మార్ష్‌ పట్టుదల కొనసాగించడంతో స్కోరు 350 దాటింది. మార్ష్‌ తొమ్మిదో వికెట్‌ రూపంలో వెనుదిరిగిన కాసేపటికే ఇన్నింగ్స్‌ ముగిసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ (5/124) ఆకట్టుకున్నాడు. ఫిలాండర్‌ (3/59), రబాడ (2/74) కూడా రాణించారు.

Story first published: Saturday, March 3, 2018, 9:47 [IST]
Other articles published on Mar 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+