డిసెంబరులో సంజూ శాంసన్ పెళ్లి: వధువు ఎవరో కాదు!

హైదరాబాద్: కేరళ క్రికెటర్ సంజూ శాంసన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన కాలేజీ క్లాస్‌మేట్ అయిన చారుతో గత ఐదేళ్లుగా సంజూ శాంసన్ డేటింగ్ చేస్తున్నాడు. అయితే, ఈ విషయం ఇప్పటివరకు బయటకు రాలేదు.

డిసెంబరులో పెళ్లి
అయితే, ఇప్పుడు వీరి ప్రేమకు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో చారుని ఈ ఏడాది డిసెంబరులో పెళ్లి చేసుకోనున్నట్టు సంజూ శాంసన్ అధికారిక ప్రకటన చేశాడు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో తనకు కాబోయే భార్య చారుతో కలిసి దిగిన ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు.
చారు ప్రస్తుతం పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతోంది
సంజూ శాంసన్‌కు కాబోయే మామ రమేశ్ కుమార్ ఓ న్యూస్ ఏజెన్సీకి తెలిపిన వివరాల ప్రకారం వీరిద్దరి పెళ్లి ఈ ఏడాది డిసెంబర్ 22న జరిపించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చారు పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతోంది. వీరిద్దరూ మార్ ఇవనోయిస్ కాలేజీలో కలిసి చదువుకున్నారు.

భారత్-ఏ జట్టుకు ఎంపికైన సంజూ శాంసన్
ఈ ఏడాది సంజూ శాంసన్ ఇంగ్లాండ్‌లో పర్యటించే భారత్-ఏ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే, యో-యో టెస్టు పాస్ కారణంగా అతడికి బోర్డు జట్టు నుంచి తప్పించింది. ఐపీఎల్ 2018 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సంజూ శాంసన్ 15 మ్యాచ్‌ల్లో 441 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన
దీంతో ఈ ఏడాది ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. కేరళకు చెందిన ఈ వికెట్ కీపర్ భారత్ తరుపున 2015లో ఏకైక టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో 19 పరుగులు సాధించాడు. అయితే, దేశవాళీ క్రికెట్‌లో మాత్రం సంజూ శాంసన్ నిలకడగా ఆడుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications