
వివరాల్లోకి వెళితే... తిరువనంతపురంలోని అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో క్రికెటర్ రోహన్ ప్రేమ్ ఆడిటర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. 2015లో అతనికి ఈ ఉద్యోగం వచ్చింది. అయితే ఫోర్జరీ చేసిన డిగ్రీ సర్టిఫికెట్ తీసుకొచ్చాడనే ఆరోపణలతో అతనికి రెండు నెలల క్రితం ఉద్యోగం నుంచి తొలిగించారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ వర్సిటీ నుంచి రోహన్ బీకామ్ పట్టా పొందాడు. దీని గురించి యూనివర్సిటీని ఆరా తీయగా, అతను అక్కడ చదువుకోలేదని తేలింది. దీంతో అకౌంటెంట్ జనరల్ ఆఫీసు ఉద్యోగం నుంచి తొలగించారు. 31 ఏళ్ల రోహన్ కేరళ రాష్ట్ర జట్టు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు.
గత నెలలో ముగిసిన రంజీ సీజన్‌లో కూడా అతను రాష్ట్ర జట్టుకు ఆడాడు. సర్టిఫికెట్ ఫోర్జరీ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కాగ్ ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. దీంతో రోహన్‌పై కేరళ సచివాలయానికి సమీపంలో ఉన్న కంటోన్మెంట్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
నిజానికి రోహన్ ప్రేమ్ ఇంటర్ మాత్రమే పాసయ్యాడు. దీంతో అతడికి డేటా ఎంట్రీ ఆపరేటర్ మాత్రమే వస్తుంది. అయితే నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌తో ఆడిటర్ ఉద్యోగం సంపాదించాడు.