Ranji Trophy Final: పాపం, సచిన్ బేబీకి హార్ట్ బ్రేక్ - జస్ట్ 2 పరుగుల్లో మిస్
Ranji Trophy Final: రంజీ ట్రోఫీ ఫైనల్ లో కేరళ, విదర్భ జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. అయితే ఈ తుదిపోరులో కేరళ జట్టు కెప్టెన్ సచిన్ బేబీ అద్భుత ఇన్నింగ్స్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ దురదృష్టవశాత్తు సెంచరీకి రెండు పరుగుల దూరం ఉన్న నేపథ్యంలో ఔట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్ లో 235 బంతులు ఎదుర్కొన్న అతడు 10 ఫోర్ల సాయంతో 98 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడి కెప్టెన్ ఇన్నింగ్స్ వృథా అయిపోయాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 37 పరుగులు ఆధిక్యంలో నిలిచింది.
కేరళ ఇన్నింగ్స్ లో సచిన్ తో పాటు ఆదిత్య (185 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 79 పరుగులు) కూడా అద్భుతంగా ఆడాడు. దీంతో కేరళ మూడో రోజు ఆట ముగిసే పూర్తయ్యే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 342 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో అహ్మద్ ఇమ్రాన్ (37), సల్మాన్ నిజర్ (21), మహ్మద్ అజారుద్దీన్ (37), జలజ్ సక్సేనా (28 నాటౌట్) రాణించారు.

ఏకంగా 150 పరుగులతో ధనాధన్..
అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన విదర్భ జట్టు 379 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్స్ లో యంగ్ బ్యాటర్ డానిష్ మలేవార్ (285 బంతుల్లో 15 ఫోర్లు 3 సిక్స్ ల సాయంతో 153 పరుగులు) సూపర్ సెంచరీ బాదాడు. దీంతో విదర్భ భారీ స్కోర్ చేసింది. అతడికి కరుణ్ నాయర్ (188 బంతుల్లో 8 ఫోర్లు ఒక సిక్స్ సాయంతో 86) సహకరించాడు. మిగతా బ్యాటర్లలో యశ్ ఠాకూర్ (25), అక్షయ్ వాడ్కర్ (23), నఛికేట్ భూటె (32) పర్వాలేదనిపించారు. కాగా, సెమీఫైనల్లో ముంబయిను ఓడించి విదర్భ ఫైనల్‌కు అర్హత సాధించగా.. గుజరాత్‌పై ఆధిక్యం సాధించి కేరళ తొలిసారి ఫైనల్‌కు చేరింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications