Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రికార్డు రాజు 'మిగెల్‌ కమిన్స్‌'కు నిరాశ.. విండీస్ జట్టులోకి కీమో పాల్

Keemo Paul replaces Miguel Cummins for second Test vs India

జమైకా: చీలమండ గాయం కారణంగా ఆంటిగ్వా టెస్టుకు దూరమయిన విండీస్ ఆల్‌రౌండర్‌ కీమో పాల్ కోలుకున్నాడు. జమైకాలో శుక్రవారం నుంచి భారత్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగే రెండో టెస్టుకు 13 మంది సభ్యుల విండీస్ జట్టులో కీమో పాల్ చోటు దక్కించుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ మిగెల్ కమిన్స్ స్థానంలో జట్టులోకి వచ్చాడు.

'గాయం కారణంగా మొదటి టెస్టుకు దూరమయిన కీమో పాల్ కోలుకున్నాడు. అతడు జట్టు ఎంపికకు అందుబాటులో ఉన్నాడు' అని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. విండీస్ బోర్డు రెండో టెస్టు కోసం 13 మంది సభ్యులతో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో చివరి ఆటగాడిగా క్రీజులోకి వచ్చిన మిగెల్.. 45 బంతులు ఆడి డకౌట్‌ అయ్యాడు. దీంతో అతన్ని తప్పించి పాల్‌కు అవకాశమిచ్చారు. మరి తుది జట్టులో చోటు దక్కించుకుంటాడో లేదో చూడాలి.

భారత్, విండీస్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో మిగెల్ కమిన్స్ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లికించుకున్నాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో చివరి ఆటగాడిగా క్రీజులోకి వచ్చిన మిగెల్.. 45 బంతులు ఆడి డకౌట్‌ అయ్యాడు. దీంతో అత్యధిక బంతులు ఆడి డకౌట్ అయిన విండీస్ క్రికెటర్‌గా మిగెల్ నిలిచాడు. కె. అర్ధర్‌టన్, ఎం.డిల్లాన్, సి.బట్స్, ఆర్.ఆస్టిన్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కమిన్స్‌ 95 నిమిషాల పాటు క్రీజ్‌లో ఉండటం గమనార్హం. చివరకు స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో చివరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. తొలి టెస్టులో భారత్‌ 318 పరుగులతేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. శుక్రవారం నుండి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.

West Indies squad:
Jason Holder (captain), Kraigg Braithwaite, Darren Bravo, Shamarh Brooks, John Campbell, Roston Chase, Rakheem Cornwall, Jahmar Hamilton, Shannon Gabriel, Shimron Hetmyer, Shai Hope, Keemo Paul, Kemar Roach.

Story first published: Wednesday, August 28, 2019, 14:44 [IST]
Other articles published on Aug 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+