Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బౌలర్‌ అంచనాలతో పాటు ధోని ఆలోచనలను కూడా అర్ధం చేసుకోవాలి: జాదవ్

Kedar Jadhav on his match-winning stand with MS Dhoni: Its like batting with 2 heads

హైదరాబాద్: మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకుంది. అంతేకాదు ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి.

మహేంద్రసింగ్ ధోని (87 నాటౌట్), కేదార్ జాదవ్ (61 నాటౌట్) అజేయ అర్ధశతకాలు బాదడంతో 231 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన సంగతి తెలిసిందే. ధోనితో పాటు క్రీజులో ఉండటం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్ పేర్కొన్నాడు.

మ్యాచ్ అనంతరం యజువేంద్ర చాహల్‌తో కలిసి బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్యూలో కేదార్ జాదవ్ మాట్లాడుతూ "ఆస్ట్రేలియాలో ఇదే నా తొలి మ్యాచ్‌. మరొకవైపు సిరీస్‌లో చివరి మ్యాచ్‌ కావడంతో క్రీజులో ఎక్కువసేపు ఉండేందుకు నిశ్చయించుకున్నాను. స్ట్రైక్‌ రొటేట్ చేస్తూ చివరివరకూ క్రీజులో ఉంటే టార్గెట్‌ చేరుకుంటామని అనుకున్నా" అని అన్నాడు.

"మరో ఎండ్‌లో ధోని ఉండడంతో నా ఆలోచనలకు బలం చేకూరింది. బ్యాటింగ్‌ చేసే క్రమంలో నా సందేహాలను ధోని వద్ద నివృత్తి చేసుకునేవాడిని. ధోని మరో ఎండ్‌లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌ చేయడం సులభంగా ఉంటుంది. క్రీజులో ధోని ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న బౌలర్‌ అంచనాలతో పాటు ధోని ఆలోచనలను కూడా అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అతను క్రీజులో ఉంటే కొండంత బలం" అని జాదవ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, January 19, 2019, 16:04 [IST]
Other articles published on Jan 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+