Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK VS SRH: చెపాక్ స్టేడియంలో కావ్య పాప నవరసాలు..!

Kavya Maran: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. చెన్నై సపర్ కింగ్స్ పై (CSK VS SRH) ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. చెపాక్ స్టేడియంపై 12 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలను కూడా సజీవం చేసుకుంది. అయితే ఈ మ్యాచుకు తమిళ స్టార్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. సీఎస్కే జట్టును ప్రోత్సాహిస్తూ.. ఆటగాళ్లలో జోష్ నింపారు. హీరో అజిత్ కుమార్ ఫ్యామిలీ, శివ కార్తికేయన్, శ్రుతి హాసన్.. ఇలా పలువురు హాజరయ్యారు.

అయితే సెలబ్రిటీలు ఇంతమంది హాజరైనప్పటికీ.. వారి ఎక్స్ ప్రెషన్స్ కన్నా.. మళ్లీ ఎప్పటిలానే సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ హావాభావాలే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరలై, అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. మరో విషయమేమిటంటే.. ఈ మ్యాచులో కావ్య పాప నవరసాలు పలికించడం విశేషం. ప్రతి బంతికి ఆమె రియాక్షన్ ఇస్తూనే ఉంది. టీవీలు చూస్తున్న ప్రేక్షకులు.. మ్యాచు కన్నా ఎక్కువగా ఆమె హావాభావాలకే ఫిదా అయిపోయారు.

Kavya Maran s Reactions goes viral in CSK VS SRH match chepauk stadium IPL 2025

లేచి నిలబడి ఎగురుతూ..
ఈ మ్యాచులో సీఎస్కే విధ్వంసకర బ్యాటర్ బ్రెవిస్ (42) బాదిన బంతిని.. సన్ రైజర్స్ ప్లేయర్ కమిందు మెండీస్ అద్భుతంగా క్యాచ్ ఒడిసిపట్టుకున్నాడు.హర్షల్‌ పటేల్‌ వేసిన 13వ ఓవర్లో చివరి బంతిని బ్రెవిస్‌ బౌండరీగా మలిచేందుకు ప్రయత్నించాడు. కానీ, మెండిస్‌ గాల్లోకి ఎగిరి మరీ అన్‌బిలీవబుల్ ఎక్స్‌ట్రార్డినరీ క్యాచ్ ను పట్టుకుని ప్రేక్షకుల చేత ఔరా అనిపించాడు. ఇది చూసిన కావ్య మారన్.. లేచి నిలబడి కేరింతలు కొడుతూ మెండిస్ ను అభినందించింది. అప్పుడు ఆమె ముఖం బాగా వెలిగిపోయింది.

బూతులు తిడుతూ..!
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ లో ఏడో ఓవర్ అన్సారి వేయగా.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాల్లోకి బంతిని లేపాడు. దీంతో ఆ క్యాచ్ పట్టుకునేందుకు ప్రయత్నించిన హర్షల్ పటేల్ అనూహ్యంగా మిస్ చేశాడు. ఆ బంతి నేరుగా హర్షల్ పటేల్ చేతిలోకి వెళ్లింది. కానీ అతడు క్యాచును చేజార్చాడు. దీంతో బంతి కింద పడిపోయింది. అయితే క్యాచ్ పట్టుకున్నాడన్న ఆనందంతో ఎగిరి గంతేయబోయిన కావ్య.. అంతలోనే క్యాచ్ మిస్ అవ్వడంతో.. సెకన్లతో చాలా సీరియస్ గా మారిపోయింది. నోరు తెరిసి గట్టిగా ఏదో తిడుకూ కనిపించింది. తాను కూర్చున్న సీట్లో నుంచి లేచి మరి అసహనం వ్యక్తం చేసింది. దీనికి కావ్య బూతులు తిట్టిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కమింద్ పై ఫుల్ ఫైర్..
ఇంకా ఈ మ్యాచులో కమిందు మెండీస్ ఫ్రీ హిట్ బంతిని సిక్స్ గా మలచలేకపోవడంతో ఎంతో అసహనం వ్యక్తం చేసింది. అసలు ఏంది ఇలా ఆడుతున్నావు అన్నట్లుగా తన చేతిని చూపిస్తూ కాస్త ఫైర్ అయింది కావ్య మారన్. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో బాగా చక్కర్లు కొడుతోంది.

Story first published: Saturday, April 26, 2025, 0:27 [IST]
Other articles published on Apr 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+