Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కృనాల్ విచిత్ర బౌలింగ్.. వెంకీతో కావ్య పాప సీరియస్ డిస్కషన్! (వీడియో)

ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా ఇచ్చే హావభావాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. ఈ ఉత్కంఠభరిత పోరులో కూడా ఆమెకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. మ్యాచ్‌లో ఓ విచిత్రమైన బౌలింగ్ యాక్షన్‌ను చూసి ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా పక్కన ఉన్నవారితో లైవ్‌లోనే వాదనకు దిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మఖ్యంగా కావ్య మారన్ పక్కనే ఉన్న టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్‌తో ఆమె జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఈ సంఘటన ఆర్సీబీ బౌలింగ్ చేస్తున్న సమయంలో చోటుచేసుకుంది. ఆర్సీబీ స్పిన్నర్ కృనాల్ పాండ్యా బౌలింగ్ వేయడానికి వచ్చాడు. క్రీజులో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. సాధారణంగా స్పిన్ బౌలర్లు లూజ్ డెలివరీలు లేదా కేరమ్ బాల్స్ వేస్తుంటారు. కానీ కృనాల్ పాండ్యా మాత్రం అందరికీ షాక్ ఇస్తూ.. ఒక ఫాస్ట్ బౌలర్ తరహాలో నితీష్ కుమార్ రెడ్డికి వేగవంతమైన బౌన్సర్ విసిరాడు. ఆ బాల్ కాస్త లైన్ తప్పి వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లడంతో అంపైర్ దాన్ని వైడ్‌గా ప్రకటించాడు. అయితే స్పిన్నర్ వేసిన ఈ ఫాస్ట్ బౌన్సర్ మైదానంలో ఉన్నవారినే కాకుండా స్టాండ్స్‌లో ఉన్న కావ్యమారన్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది.

Kavya Maran Serious Discussion With Venkatesh about Krunal Pandya Weird Bowling Video Goes Viral

ఆర్సీబీ స్పిన్నర్ కృనాల్ పాండ్యా బౌలింగ్ యాక్షన్, ఆ బంతి వచ్చిన వేగాన్ని చూసి విస్తుపోవడం కావ్య మారన్ వంతైంది. ఆ బంతి పడిన వెంటనే కావ్య మారన్ తన సీట్లోంచి వెనక్కి తిరిగి పక్కనే కూర్చున్న టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ వైపు చూసింది. తన చేతులతో బౌలింగ్ యాక్షన్ ను అనుకరిస్తూ.. "వెంకీ గారు ఆ బాల్ ఏంటి? కృనాల్ స్పిన్ వేయకుండా అలా విసిరేశాడు (చకింగ్ చేశాడా)?" అన్నట్లుగా ఎంతో ఆశ్చర్యంతో, కాస్త అసహనంతో ప్రశ్నించారు. క్రికెట్ మెళకువలు బాగా తెలిసిన వెంకటేష్ కూడా ఆమె అన్నదానికి స్పందిస్తూ ఆ యాక్షన్ గురించి చర్చించడం లైవ్ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది.

స్టేడియంలో మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్నప్పటికీ.. కావ్యమారన్ మాత్రం కాసేపటి వరకు ఆ బౌలింగ్ యాక్షన్ గురించే చుట్టుపక్కల ఉన్నవారితో చర్చిస్తూ కనిపించారు. కావ్య మారన్ పదే పదే చేతులు తిప్పుతూ కృనాల్ యాక్షన్‌ను తప్పుబడుతున్నట్లుగా ఇచ్చిన హావభావాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించినప్పటికీ.. ఈ విక్టరీ కంటే కూడా కావ్య మారన్ - హీరో వెంకటేష్‌ల 'చకింగ్' ముచ్చట్లే హైలైట్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది.

Story first published: Saturday, May 23, 2026, 9:33 [IST]
Other articles published on May 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+