ఐపీఎల్ మెగా వేలం నిబంధనలు దాదాపు ఖరారయ్యాయి. ఓ ఆర్‌టీఎమ్ కార్డ్‌ను ఉపయోగిస్తూ గరిష్టంగా ఆరుగురు ఆటగాళ్లను ఓ ఫ్రాంచైజీ అట్టిపెట్టుకునే అవకాశం ఉంది. అంటే అయిదుగురు ప్లేయర్లను నేరుగా రిటైన్ చేసుకుంటూ వేలంలో అదనంగా ఓ ఆటగాడిని ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా దక్కించుకోవచ్చు. దీనిపై మరికొన్ని గంటల్లో బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన విడుదల కానుంది.
ఈ క్రమంలో ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌ను సిద్ధం చేయడానికి చర్యలు వేగవంతం చేస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ లిస్ట్‌ను దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. బీసీసీఐ వెల్లడించనున్న ఈ 5+1 ఆర్‌టీఎమ్ కార్డ్ నిబంధనలు ఎస్‌ఆర్‌హెచ్‌కు గొప్పగా కలిసొస్తున్నాయి. ఆర్‌టీఎమ్ కార్డ్ లేకుండా కేవలం అయిదుగురు ఆటగాళ్లనే రిటైన్ చేసుకోవాలనే రూల్ ఖరారైతే.. ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యానికి తలనొప్పిగా మారేది.

ఎందుకంటే అయిదుగురు ఆటగాళ్లలో ఇద్దరు విదేశీ ప్లేయర్లకు మాత్రమే ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. సన్‌రైజర్స్ జట్టులో కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు ఓపెనర్ ట్రావిస్ హెడ్, వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ ఎంతో కీలకం. ఈ ముగ్గురిలో ఒకరిని విడిచిపెట్టాలంటే మ్యాచ్ విన్నర్‌ను కోల్పోయినట్లే. కానీ ఆర్‌టీఎమ్ కార్డ్ ఉపయోగిస్తూ ముగ్గురుని సొంతం చేసుకోవచ్చు. అయితే దీనిలో ఎస్ఆర్‌హెచ్ సీఈవో కావ్య మారన్ ఆర్థిక వ్యూహాలు అమలు చేయనుంది. కమిన్స్, క్లాసెన్‌ను రిటైన్ చేసుకుని హెడ్‌ను ఆర్‌టీఎమ్ ద్వారా దక్కించుకోవాలని చూస్తోంది.
కమిన్స్ బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు కెప్టెన్సీలోనూ సత్తాచాటగలడు. ఇక క్లాసెన్ వికెట్ కీపింగ్‌తో ఫినిషర్‌గా రాణించగలడు. వీరిద్దరికి వేలంలో భారీ డిమాండ్ ఉంటుంది. హెడ్‌కు కూడా డిమాండ్ ఉన్నప్పటికీ విభిన్న పాత్రలు పోషించే వారి కంటే కాస్త తక్కువగా ఉంటుంది. దీంతో పర్స్‌వ్యాల్యూను కాపాడుకోవచ్చని కావ్య మేడమ్ ఆలోచిస్తోంది. ఇక కుర్రాళ్లను రిటైన్ చేసుకోవాలని కావ్య భావిస్తోంది. అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, నటరాజన్‌ను రిటైన్ లిస్ట్‌లో యాడ్ చేసింది. ఒకవేళ విదేశీ ప్లేయర్లకు లిమిట్ విధించకపోతే.. నితీశ్ లేదా నటరాజన్ ఆర్‌టీఎమ్ ద్వారా దక్కించుకోవాలని కావ్య ఆలోచిస్తోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటెన్షన్ లిస్ట్ (అంచనా):
ప్యాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, నటరాజన్
ఆర్‌టీమ్ కార్డ్- ట్రావిస్ హెడ్.