Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Kavya Maran: ప్రేమ పొంగింది - అత్తయ్యను గట్టిగా హత్తుకున్న కావ్య పాప!

IPL 2025 Sunrisers Hyderabad: ఈ సారి 300 పక్కా అంటూ భారీ అంచనాలతో.. ఈ ఐపీఎల్ సీజన్ బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. 150,200 ( మొదటి మ్యాచ్ మినహా) చేయలేక తుస్సుమనిపించింది. మొదట ఐదు మ్యాచుల్లో వరుసగా నాలుగు మ్యాచుల్లో చిత్తుగా ఓడి నిరాశపరిచింది. అయితే ఇప్పుడు మళ్లీ... ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ తర్వాత మాయమైపోయిన మెరుపులను తాజాగా ఉప్పల్‌ వేదికగా మెరిపించి అభిమానుల్లో జోష్ నింపింది సన్‌రైజర్స్‌. కాటేరమ్మ కొడుకులు మళ్లీ తమ ఫామ్‌ అందుకోవడంతో ప్రత్యర్థి బౌలింగ్‌ను ఊచకోత కోసింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో ట్రావిస్ హెడ్‌ తుపానును తలపిస్తే.. అభిషేక్‌ సునామీలా ముంచెత్తాడు. దీంతో సన్‌రైజర్స్‌ సూపర్ విక్టరీ అందుకుంది.

Kavya Maran: అయితే ఈ విజయం కేవలం అభిమానుల్లో మాత్రమే కాదు.. వరుసగా నాలుగు ఓటములతో నిరాశతో ఉన్న టీమ్ ఓనర్ కావ్య మారన్ లోనూ సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. పైగా మ్యాచ్ గెలిస్తే ఉత్సాహంతో చెలరేగిపోవడం, ఓడిపోతే ఉసూరుమనడం.. ఉత్కంఠగా సాగుతుంటే ఊపిరి బిగపట్టి చూడటం.. కావ్య మారన్ కు అలవాటే. అందులోనూ ఈ ముద్దుగుమ్మ.. అందగత్తె కాబట్టి ఆ అమ్మడి ప్రతి భావోద్వేగాన్ని జూమ్‌ చేసి మరీ కెమెరాలు చూపిస్తుంటాయి. అలాగే ఇప్పుడు కూడా మరోసారి కావ్యమారన్ ను చూపించాయి.

అలా అందులో తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియో సన్‌రైజర్స్‌ అభిమానులను మాత్రమే కాదు.. క్రికెట్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఆ వీడియోలో కావ్య మారన్.. మ్యాచ్ విజయంలో కీలకంగా వ్యవహరించిన అభిషేక్‌ శర్మ (141; 55 బంతుల్లో 14×4, 10×6) తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా హత్తుకుంది. అభిషేక్ తల్లిని హత్తుకుని, ఆమెకు అభినందనలు తెలిపింది. ప్రస్తుతం ఈ హార్ట్ టచింగ్ మూమెంట్ ప్రతీ క్రికెట్ అభిమానిని ఆకట్టుకుంటోంది.

Kavya Maran hugs Abhishek Sharma Mother and congratulated her after SRH victory against pbks ipl 2025

దీంతో అందరూ.. కావ్య మారన్ హగ్గింగ్ ఫొటోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. 'పెళ్లి పక్కా', 'అసలైన మజా ఇదే', 'ప్రైడ్ ఆఫ్ మూమెంట్' అంటూ లవ్, హార్ట్ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఆలానే మరోసారి కావ్య మారన్ - అభిషేక్ శర్మ డేటింగ్ రూమర్స్ ను మరోసారి తెరపైకి తీసుకొస్తున్నారు.

Story first published: Sunday, April 13, 2025, 10:10 [IST]
Other articles published on Apr 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+