కోట్లు పోసినా మిగిలింది కన్నీళ్లే.. కావ్య పాప హిట్ లిస్ట్‌లో ఉన్న ఆటగాళ్ల వీరే!
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్‌కు క్రికెట్ అన్నా.. తన టీమ్ అన్నా ఎంత ప్రాణమో ఎందరికీ తెలిసిందే. స్టేడియంలో జట్టు కొట్టే ప్రతి ఫోర్, సిక్సర్‌కు కావ్య మారన్ ఎగిరి గంతేయడం.. వికెట్ పడినప్పుడు నిరాశతో ముఖం తిప్పుకోవడం ఫ్యాన్స్‌ను ఎంతో ఆకట్టుకుంటుంది. అయితే ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా ఓడిపోవడంతో కావ్య మారన్ గుండె మరోసారి పగిలింది. స్టేడియంలో కావ్య మారన్ ఏడుపు ముఖం చూసిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆమె కోసం చాలా బాధపడుతున్నారు.
కావ్య మారన్ నిరాశ.. ఆటగాళ్లపై ఫ్యాన్స్ ఆగ్రహం
వేలంలో నీళ్లలా డబ్బులు కుమ్మరించి, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జట్టును కావ్య మారన్ తయారు చేసుకున్నారు. కానీ కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో కోట్లు పెట్టి కొన్న ఆటగాళ్లు చేతులెత్తేయడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతటి భారీ మొత్తాన్ని తీసుకుంటూ కూడా అత్యంత ముఖ్యమైన మ్యాచ్‌లో జట్టును నట్టేట ముంచిన కొందరు సీనియర్ల ప్రవర్తనపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2027 మెగా వేలానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఊహించని మార్పులు జరగడం ఖాయమని, ఐదుగురు స్టార్ ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించడం దాదాపు ఖాయమని తెలుస్తోంది.

గత 3 సీజన్లలో సన్‌రైజర్స్ విఫలమే..
గత మూడేళ్ల ఐపీఎల్ చరిత్రను పరిశీలిస్తే, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కావ్య మారన్‌కు కేవలం బాధను మాత్రమే మిగిల్చింది. 2024లో లీగ్ దశలో అద్భుతంగా ఆడినప్పటికీ, ఫైనల్‌లో కేకేఆర్ ముందు పేకమేడలా కూలిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2025లో అసలు ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేక పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. 2026 సీజన్‌లో భీకరమైన ఆట తీరు కనబరిచినప్పటికీ.. అత్యంత కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ముందు చేతులెత్తేసింది.
అవసరం లేని చోట రికార్డులు.. కీలక మ్యాచ్‌ల్లో చేతులెత్తేయడమేనా?
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వంటి దిగ్గజ ఓపెనర్లు ఉన్నప్పటికీ కీలక మ్యాచ్‌ల్లో వారు ఆడకపోవడంపై అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒత్తిడి లేని మ్యాచ్‌ల్లో రికార్డుల వేట సాగించే ఈ ఓపెనర్లు.. డూ ఆర్ డై మ్యాచ్ వచ్చేసరికి ఘోరంగా ఫ్లాప్ అవుతున్నారని విమర్శిస్తున్నారు. అభిషేక్ శర్మ షాట్ సెలక్షన్ చిన్నపిల్లల ఆటలా ఉందని.. ట్రావిస్ హెడ్ బాధ్యతారాహిత్యంగా ఆడాడని, అలాగే సరైన సమయంలో ఇషాన్ కిషన్ బ్యాట్ కూడా ఝులిపించలేకపోయిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వీరంతా కలిసి కావ్య మారన్ కలలను కల్లలు చేశారు.
ఐపీఎల్ 2027లో ఐ ఐదుగురు ఆటగాళ్లు ఔట్!
*లియామ్ లివింగ్‌స్టోన్: రూ. 13 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసినప్పటికీ.. ఈ సీజన్‌లో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. మెగా వేలంలో ఇతడిని విడుదల చేయడం ఖాయం.
*హర్షల్ పటేల్: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా జట్టులోకి వచ్చిన హర్షల్ పటేల్.. ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయకుండా పూర్తిగా నిరాశపరిచాడు.
*జయదేవ్ ఉనద్కత్: ఈ సీజన్లో 4 మ్యాచ్‌లు ఆడి కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. పైగా 10.91 అత్యంత చెత్త ఎకానమీ రేటుతో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.
*హర్ష్ దూబే: బౌలింగ్‌లో 8 వికెట్లు తీసినప్పటికీ.. ఆల్‌రౌండర్‌గా బ్యాటింగ్‌లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. ఈ సీజన్ మొత్తం మీద బ్యాట్‌తో కేవలం 13 పరుగులు మాత్రమే చేశాడు.
*గెరాల్డ్ కోయెట్జీ: రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా జట్టులోకి వచ్చినప్పటికీ.. విదేశీ ఆటగాళ్ల కాంబినేషన్ కుదరకపోవడం వల్ల ఈ సీజన్‌లో అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications