Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆనందంతో ఊగిపోయిన కావ్య పాప! (వీడియో)

ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా శనివారం హైదరాబాద్ వేదికగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఎస్ఆర్‌‌హెచ్ గెలుపొందడంతో జట్టు యజమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్టేడియంలో కావ్యమారన్ చేసిన సెలబ్రేషన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన జట్టు గెలుపును చూసి కావ్యమారన్ ఎంతో ఉత్సాహంగా గాలిలో పిడికిలి బిగించి, చప్పట్లు కొడుతూ చేసిన సంబరాలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

సీఎస్కే పతనాన్ని శాసించిన బౌలర్లు
ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 194 పరుగులు చేసింది. సీఎస్కే ముందు ఉంచిన 195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు బ్యాటర్లు ఓ దశలో విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించారు. అయితే సన్‌రైజర్స్ బౌలర్లు నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ మలింగ కీలక సమయంలో వికెట్లు తీసి సీఎస్కే పతనాన్ని శాసించారు. వీరిద్దరూ కలిసి మొత్తం 5 వికెట్లు పడగొట్టి ఓటమి అంచున ఉన్న తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించారు. చివరికి సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Kavya Maran Celebrates SRH Thrilling Win Over CSK in IPL 2026 Viral Celebration Video Highlights

దాని వల్లే విజయం సాధ్యం
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ విభాగంలో ఎషాన్ మలింగ (4 ఓవర్లలో 3/29), సాకిబ్ హుస్సేన్ (4 ఓవర్లలో 1/32), నితీష్ రెడ్డి (4 ఓవర్లలో 2/31), శివాంగ్ కుమార్ (3 ఓవర్లలో 1/18) కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి సీఎస్కే బ్యాటర్లను కట్టడి చేశారు. మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. యువ పేసర్ల ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టు ప్రణాళికలను యువ బౌలర్లు చక్కగా అమలు చేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని, ఇది తన కెప్టెన్సీ పనిని సులభతరం చేసిందని ఇషాన్ కిషన్ పేర్కొన్నాడు.

మా ఓటమికి కారణం ఇదే: రుతురాజ్ గైక్వాడ్
ఈ గెలుపుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ 4 స్థానాల్లో ఒకటిగా నిలిచింది. మరోవైపు సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. పది ఓవర్ల తర్వాత భాగస్వామ్యాలు నిర్మించలేకపోవడం తమ ఓటమికి కారణమని విశ్లేషించాడు. బ్యాటింగ్ ట్రాక్ అయినప్పటికీ, తమ బౌలర్లు సన్‌రైజర్స్‌ను 200 పరుగుల లోపే కట్టడి చేయడం అభినందనీయమని రుతురాజ్ పేర్కొన్నాడు. ఏది ఏమైనా ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ప్రదర్శన, కావ్య మారన్ ఉత్సాహభరితమైన సెలబ్రేషన్స్ అభిమానులకు గుర్తుండిపోయేలా చేశాయి.

Story first published: Sunday, April 19, 2026, 8:20 [IST]
Other articles published on Apr 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+