'ఎవడు మూర్తి వీడు నా సిస్టమ్ ను టచ్ చేశాడు అని ఒకడంటే'.. 'ఈ జీవితానికి కావ్య పాప నవ్వు చాలురా' అని మరొకడు.. 'ఒక్క హగ్ - ఇద్దరు బిలీయనీర్స్'.. 'చూడటానికి ఎంత చూడముచ్చటగా ఉందో అంటూ.. రెండు కళ్లు చాలట్లేదు'.. 'కావ్య పాప అంటేనే అందం.. అందం అంటేనే కావ్య పాప'.. ఇలా ఎవరికి వారు తమకు నచ్చిన కామెంట్స్ తో, లవ్ ఎమోజీలతో ఈ పై ఫొటోను తెగ షేర్ చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
రీసెంట్ గా ముగిసిన SA20లీగ్ ఫైనల్ లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఈస్టర్న్ ను ఓడించి ముంబయి కేప్ టౌన్ విజేతగా అవతరించింది. తొలిసారి ఈ లీగ్ చరిత్రలో ట్రోఫీని ముద్దాడింది. ఈ సందర్భంగా సన్ రైజర్స్ ఓనర్ కావ్య పాప - ముంబయి ఓనర్ ఆకాశ్ అంబానీ కలిగి దిగిన ఫొటోనే ఇది. మైదానంలో ఇద్దరు ప్రత్యర్థులు అయినప్పటికీ.. మ్యాచ్ అనంతరం తమ చర్యలతో స్పోర్ట్స్ స్పిరిట్ ను నింపారు. ఫైనల్ ముగియగానే.. తమ జట్ల పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు హగ్ చేసుకుని అభినందించుకున్నారు. కంగ్రాట్స్ అని కావ్యపాప అంటుంటే.. మీరు కూడా గొప్పగా పోరాడాడు అంటూ ఆకాశ్ అంబానీ పొగిడాడు. అలా కాసేపు సరదాగా నవ్వుకుంటూ ఇద్దరు ముచ్చటించుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో నెటిజన్లు బాగా ఆకర్షిస్తోంది. మరీ ముఖ్యంగా కావ్య మారన్ నవ్వు ప్రేక్షకులను మరోసారి ఫిదా చేసింది. దీంతో నెటిజన్లు, క్రికెట్ ప్రియులు ఫొటోను షేర్ చేస్తూ పై కామెంట్లు పెడుతున్నారు.

వాస్తవానికి కావ్య మారన్.. స్టేడియంలో జస్ట్ అలా కనిపిస్తే చాలు సోషల్ మీడియా అంతా ఆమె ఫొటోలతోనే షేక్ అయిపోతుంది. ఆమె అందానికి, నవ్వుకు అందరూ ఫిదా అయిపోతుంటారు. ఐపీఎల్ సయయంలో హైదారాబాద్ మ్యాచ్ లకు హాజరై ఓ వైపు తన జోష్ తో ఆటగాళ్లను ప్రోత్సాహిస్తూనే.. మరోవైపు తన హావాభావాలతో ఆడియెన్స్ ను ఆకర్షిస్తూ ఉంటుంది కావ్య. అయితే రీసెంట్ గా ముగిసిన సౌతాఫ్రికా టీ20లీగ్ లో మంచి ప్రదర్శన చేస్తూ ఫైనల్ చేరుకున్న సన్ రైజర్స్ ఈస్టర్న్ జట్టును ప్రోత్సాహించేందుకు హాజరైంది. కానీ అనూహ్యంగా సన్ రైజర్స్ ఓటమి చెందింది. ఇక ఆ మ్యాచ్ ముగిసిన తర్వాతే విజేతగా నిలిచిన ముంబయి ఓనర్ ఆకాశ్ అంబానీతో సరదాగా చిరునవ్వులు చిందిస్తూ ముచ్చటించింది.
Aakash Ambani and Kavya Maran after the end of the SA20 final between MI Cape Town and Sunrisers Eastern Cape 💙 🧡
— OneCricket (@OneCricketApp) February 11, 2025
📸: Betway SA20#Cricket #MumbaiIndians #Sunrisers pic.twitter.com/BtY7aNOYk0