Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వెంకీ మామ- కావ్యా పాప: నవ్వుల బాంబులు.. !!

సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించాడు. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అద్భుతమైన ఇన్నింగ్ ఆడాడు. 47 బంతుల్లోనే శతకం పూర్తి చేసి ప్రత్యర్థి బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్ పలు రికార్డులను తిరగరాసింది. 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 135 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, తాను ఎంత గొప్ప బ్యాటరో నిరూపించాడు. ఈ క్రమంలో టీ20ల్లో 350 సిక్సర్లను కూడా పూర్తి చేసుకున్నాడు. ఫాస్టెస్ట్ సిక్సర్స్ ఇవి.

ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లకు 242 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ-135 (నాటౌట్), ట్రావిస్ హెడ్-37, ఇషాన్ కిషన్- 25, హెన్రీచ్ క్లాసెన్- 37 (నాటౌట్) దూకుడుగా ఆడారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే ఒక వికెట్ తీశాడు. ఇషాన్ రనౌట్ అయ్యాడు.

Kavya Maran Abhishek Sharma s parents and Tollywood Actor Venkatesh Daggubati soak in the moment

ఢిల్లీ కేపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 195 పరుగులే చేసింది. నితీష్ రాణా- 57 తో రాణించాడు. కేఎల్ రాహుల్- 37, సమీర్ రిజ్వీ- 41 పర్వాలేదనిపించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఎషాన్ మలింగా నాలుగు వికెట్లతో బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరిచాడు. హర్ష్‌ దూబే మూడు వికెట్లతో సత్తా చాటాడు. దిల్షాన్ మదుషంక, సకీబ్ హుస్సేన్ తలో వికెట్ తీశారు.

ఈ శతకంతో అభిషేక్ శర్మ తన టీ20 కెరీర్‌లో తొమ్మిది సెంచరీలను పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనతతో విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు. భారత బ్యాటర్లల్లో అత్యధిక టీ20 శతకాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు వీరిద్దరూ ఉన్నారు. అభిషేక్ 184 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం. రోహిత్ శర్మ ఎనిమిది సెంచరీలు చేయడానికి 454 ఇన్నింగ్స్‌లు తీసుకోగా, అభిషేక్ అత్యంత వేగంగా ఈ ఘనతను సాధించాడు.

ఒకవైపు మ్యాచ్ లో అభిషేక్ శర్మ మెరుపులు మెరిపిస్తోండగా.. మరో వైపు స్టాండ్స్ లో విక్టరీ వెంకటేష్ సందడి చేశాడు. ఫ్యాన్స్ అరెంజ్ చేసిన ఆర్కెస్ట్రాకు స్టెప్పులు వేశాడు. చూడ్డానికి వీఐపీ బాక్సే అయినప్పటికీ.. మాస్ మూమెంట్స్ కనిపించాయక్కడ. వెంకీ మామ వేసిన స్టెప్పులకు కావ్యా మారన్ చూస్తూ కూర్చోలేకపోయింది. చప్పట్లు కొట్టింది. చిన్నపిల్లలా గంతులేసింది. వీరిద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించారా సమయంలో. మరోవంక అభిషేక్ శర్మ పేరెంట్స్ కూడా అతని ఇన్నింగ్ ను మస్త్ గా ఎంజాయ్ చేశారు.

Story first published: Wednesday, April 22, 2026, 10:08 [IST]
Other articles published on Apr 22, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+