IPL 2023 : కావ్య పాప కీలక నిర్ణయం.. సన్‌రైజర్స్ కెప్టెన్ ఎవరో చెప్పేస్తుందట!

గతేడాది ఐపీఎల్‌లో ఘోరంగా ఆడిన సన్‌రైజర్స్ జట్టు.. దిద్దుబాటు చర్యల్లో భాగంగా కెప్టెన్ కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్ వంటి స్టార్ ఆటగాళ్లను విడుదల చేసేసింది.
ఆ తర్వాత మినీ వేలంలో కొంతమంది కీలక ఆటగాళ్లను భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే విలియమ్సన్ స్థానంలో జట్టును ముందుండి నడిపించే కెప్టెన్ ఎవరు? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు. భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, ఎయిడెన్ మార్క్రమ్ వంటి వాళ్లు ఈ స్థానం కోసం పోటీలో ఉన్నారు.

క్లారిటీ వచ్చేసినట్లేనా?
అయితే ఇప్పుడు తమ కెప్టెన్ ఎవరనే విషయంలో సన్‌రైజర్స్ యాజమాన్యానికి ఒక క్లారిటీ వచ్చేసిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే గురువారం నాడు జట్టు కెప్టెన్ ఎవరో ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ ట్వీట్ చూసిన సన్‌రైజర్స్ అభిమానులు ఇప్పటి నుంచే కెప్టెన్ ఎవరనే విషయంపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది ఎయిడెన్ మార్క్రమ్‌కే జట్టు పగ్గాలు అందుతాయని అంటున్నారు. ఈ సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ ఇటీవల అద్భుతంగా ఆడుతున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతను ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

అతనికే జట్టు పగ్గాలు?
కొన్నిరోజుల క్రితం ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు మార్క్రమ్ కెప్టెన్‌గా రాణించాడు. బ్యాటుతో, బంతితో అద్భుతమైన ప్రదర్శనలు చేసిన అతను.. కెప్టెన్సీలో కూడా తన మార్క్ చూపించాడు. అంతేకాదు, తొలి సౌతాఫ్రికా టీ20 లీగ్ ట్రోఫీ కూడా ముద్దాడాడు. ఈ టోర్నీలో మార్క్రమ్ కెప్టెన్సీ చూసిన సన్‌రైజర్స్ యాజమాన్యం చాలా సంతృప్తి చెందిందని, అతనికే ఐపీఎల్‌లో కూడా జట్టు పగ్గాలు అందించాలని నిర్ణయించుకుందని వార్తలు వస్తున్నాయి.

అశ్విన్ సలహా కూడా అదే..
టీమిండియా వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ విషయంపై కొన్నిరోజుల క్రితం మాట్లాడాడు. తనను అడిగితే సన్‌రైజర్స్ పగ్గాలు మార్క్రమ్‌కు ఇవ్వడమే సరైన నిర్ణయమని, అతను సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో తన సత్తా నిరూపించుకున్నాడని అభిప్రాయపడ్డాడు. మరి సన్‌రైజర్స్ యాజమాన్యం కూడా ఇదే నిర్ణయం తీసుకుందా? లేక వెటరన్ పేసర్ భువనేశ్వర్ లేదంటే ఐపీఎల్ కెప్టెన్సీ అనుభవం ఉన్న మయాంక్‌కు జట్టు పగ్గాలు అందిస్తుందా? అనేది తెలియాలంటే వేచిచూడక తప్పదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications