For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రచార కార్యక్రమం: ఐపీఎల్‌లో ఎవరు గెలుస్తారు? (వీడియో)

Kaun Jeetega?: Star India launches second phase of its campaign for IPL 2018

హైదరాబాద్: ఏప్రిల్ 7న మొదలుకాబోతున్న ఐపీఎల్‌ను పురస్కరించుకొని వీవొ ఐపీఎల్ ప్రత్యేక గీతాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ కోసం ఆతురతగా ఎదురుచూస్తోన్న క్రికెట్ అభిమానులు తక్కువ వ్యవధిలోనే 15మిలియన్ మంది వరకూ ఈ వీడియోను వీక్షించారట. ఇదే క్రమంలో ఐపీఎల్ ప్రసారదారు అయినటువంటి స్టార్ ఇండియా ప్రచారంలో భాగంగా మరో కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

బుందేల్‌ఖండ్ నుంచి మొదలుకొని మధురై వరకూ ఐపీఎల్ ఎవరూ గెలుస్తారు అనే ప్రశ్నపై ఇంటర్వ్యూలు చేయనుందట. 'కౌన్ జితేగా' అని చేస్తున్న ఈ కార్యక్రమంలో ఐపీఎల్‌లో ఎవరు గెలుస్తారు అని ఓ పిల్లవాడు తండ్రిని అడుగుతాడు. దానికి బదులుగా ఆయన పిల్లోడికి ఐపీఎల్ మ్యాచ్ చూపిస్తాడు. అలా చూపిస్తూ.. రెండు పులులు ఒకదానితో ఒకటి పోటీపడితే చివరికి పులే గెలుస్తుందని చెప్పడంతో ఆ వీడియో ముగుస్తోంది.

ఈ ప్రచార కార్యక్రమానికి ప్రాంతాల వారీగా పేరును కేటాయించారు. మధురై ప్రాంతంలో అయితే ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడూ ప్రశ్నలతో కాలక్షేపం చేస్తు ఉంటారు. కానీ, ఒకసారి స్కూలు నుంచి ఇంటికి వెళ్లి టీవీ చూస్తుండగా ఐపీఎల్ ప్రసారమవుతుంటోంది. తమ్ముడు అడిగిన అన్ని ప్రశ్నలకు సరిగ్గానే సమాధానం చెప్పిన అన్న ఐపీఎల్ ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఆగిపోతాడు. అప్పుడే సింహంతో మరో సింహం పోటీపడితే సింహమే గెలుస్తుందనే పంచలైన్ రావడంతో ముగుస్తోంది.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

జాతీయ స్థాయిలో ప్రచారం చేసేందుకు రూపొందించబడిన 'షేర్ వర్సెస్ షేర్'
కాన్సెప్ట్‌ను స్టార్ స్పోర్ట్స్ క్రియేటివ్ టీం దర్శకుడు శ్లోక్ శర్మ, హిందీ సినిమా రంగానికి చెందిన ప్రకాశ్ వర్మ, తమిళ్ నుంచి విజయ్ ప్రభాకరన్ కలిసి రూపొందించారు. దీనినే తమిళ వర్షన్‌లో యారు జెయిప్పా..గా..?, కన్నడలో యారు గెలుత్తారే..? తెలుగులో ఎవరు గెలుస్తారు..?గా పేర్లు పెట్టారు. వీవో ఐపీఎల్ పదకొండో సీజన్ ఏప్రిల్ 7తో మొదలుకానుంది. మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి.

Story first published: Friday, March 23, 2018, 15:30 [IST]
Other articles published on Mar 23, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+