Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

40 టెస్టుల తర్వాత తొలి వికెట్‌ తీసిన శ్రీలంక క్రికెటర్

హైదరాబాద్: కొలంబో వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఈ టెస్టులో శ్రీలంక బ్యాట్స్‌మన్‌ కరుణరత్నే అరుదైన ఘనత సాధించాడు. 344/3 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది.

అయితే శుక్రవారం ఆదిలోనే భారత్‌కు ఎదురు దెబ్బ తగిలింది. రెండో రోజు ఆట మొదలైన కొద్దిసేపటికే భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. తొలి సెంచరీతో కదం తొక్కిన ఛటేశ్వర్ పుజారా 133 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 92వ ఓవర్లో కరుణరత్నే వేసిన ఐదో బంతికి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరాడు.

Karunaratne claimed his maiden Test wicket in colombo test.

ఇప్పటి వరకు 40 టెస్టులాడిన కరుణరత్నేకు ఇదే తొలి వికెట్‌ కావడం విశేషం. మొదట దీనిని అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో లంక కెప్టెన్ రివ్యూ కోరాడు. రిప్లేలో ఇది అవుట్‌గా తేలింది. ఫలితంగా 217 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.

బ్యాట్స్‌మన్‌ అయిన కరుణరత్నే అప్పుడప్పుడు పార్ట్‌టైమ్‌ బౌలర్‌ అవతారమెత్తుతూ ఉంటాడు. టెస్టుల్లో ఇప్పటిదాకా కనీసం 10 ఓవర్లు కూడా వేయని కరుణరత్నే బౌలింగ్‌లో సెంచరీ వీరుడు పుజారా అవుటవ్వడం మరో విశేషం. ఇదిలా ఉంటే రెండో రోజు లంచ్ విరామ సమయానికి భార‌త్ 5 వికెట్ల‌కు 442 ప‌రుగులు చేసింది.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+