For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

karun Nair: కరుణ్ నాయర్ మళ్లీ సెంచరీ - ఆనందంతో అతడి భార్య ఏం చేసిందంటే? (వీడియో వైరల్)

karun Nair century: కరుణ్ నాయర్ మళ్లీ సెంచరీ బాదేశాడు. ఈ మధ్యే విజయ్ హాజరే ట్రోఫీలో వరుస శతకాలతో చెలరేగిన అతడు.. తాజాగా జరుగుతోన్న రంజీ ట్రోఫీ 2025 ఫైనల్ లోనూ శతకం బాది మరోసారి సెలక్టర్లకు తానున్నానంటూ బలమైన సందేశం పంపాడు.

ప్రస్తుతం రంజీ ఫైనల్ లో విదర్భ - కేరళ జట్లు తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే నాలుగో రోజు ఆటలో భాగంగా విదర్భ రెండో ఇన్నింగ్స్ లో అతడు తీవ్ర ఒత్తిడిలోనూ హండ్రెడ్ బాది ఆకట్టుకున్నాడు. 184 బంతుల్లో ఏడు బౌండరీలు, 2 సిక్స్ ల సాయంతో ఈ మార్క్ ను అందుకున్నాడు. మొత్తంగా దేశవాళీ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో కలిపి అతడు 9వ సెంచరీని నమోదు చేశాడు. గతంలో

Karun Nairs Wife Standing Ovation After Century in ranji trophy 2025 final Vidarbha vs kerala

భార్య స్టాండింగ్ ఓవియేషన్
ఈ నాలుగో రోజు ఆటకు కరుణ్ నాయర్ భార్య కూడా హాజరైంది. కరుణ్ నాయర్ శతకం బాదగానే స్టాండ్స్ లో ఉన్న ఆమె లేచి నిలబడి స్టాండింగ్ ఓవియేషన్ తో చప్పట్లు కొడుతూ సంతోషం వ్యక్తం చేసింది. తన భర్తకు సపోర్ట్ చేస్తూ ఎంతో ఉత్సాహంతో అభినందించింది. ఆమెతో పాటే స్టాండ్స్ లో ఉన్న ఇతర ప్రేక్షకులు కూడా లేచి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు.

గత 13 మ్యాచుల్లో 8 శతకాలు..
దేశవాళీ క్రికెట్ లో అతడు గత 13 మ్యాచుల్లో మొత్తంగా 8 సెంచరీలు నమోదు చేయడం విశేషం. ఈ 13 మ్యాచుల్లోని మిగతా ఇన్నింగ్స్ లో 44*, హాఫ్ సెంచరీ, 27(31), 30, 40 పరుగులు చేశాడు. ఈ గణాంకాలు బట్టి కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్ లో ఎంత నిలకడగా రాణిస్తున్నాడో అర్థమవుతోంది.

హైయెస్ట్ రన్ స్కోరర్ గా...
ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు కరుణ్ నాయర్. 389.50 సగటు, 124.04 స్ట్రైక్ రేట్ తో కేవలం 8 ఇన్నింగ్స్ లోనే 779 పరుగులు చేశాడు. అందులో ఐదు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉండటం విశేషం.

Story first published: Saturday, March 1, 2025, 16:52 [IST]
Other articles published on Mar 1, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+