ట్రిపుల్ సెంచరీ హీరో కరుణ్ నాయర్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 టోర్నీలో మైసూర్ వారియర్స్ జట్టును నడిపిస్తున్న కరుణ్ నాయర్.. మంగళూరు డ్రాగన్స్‌పై శతకంతో విరుచుకుపడ్డాడు. సిక్సర్లు, బౌండరీలతో హోరెత్తిస్తూ 48 బంతుల్లో అజేయంగా 124 పరుగులు చేశాడు.
43 బంతుల్లో మూడంకెల స్కోరును అందుకున్న కరుణ్ నాయర్ అనంతరం మరింత చెలరేగాడు. మొత్తంగా 13 ఫోర్లు, ఏడు సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. నాయర్ విధ్వంసంతో తొలుత బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలగు వికెట్ల నష్టానికి 226 పరుగుల స్కోరు చేసింది. మనోజ్ భాంగడే (31; 14 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు.

మైసూర్ వారియర్స్ ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం వరుణుడు ఆటకు ఆటంకం కలిగించాడు.దీంతో మంగళూరు డ్రాగన్స్ లక్ష్యాన్ని 14 ఓవర్లకు 166 పరుగులుగా నిర్ధారించారు. అనంతరం ఛేదనలో డ్రాగన్స్ ఏడు వికెట్లు కోల్పోయి 138 పరుగులే చేసింది. నికిన్ జోస్ (32) టాప్ స్కోరర్. అజిత్ కార్తీక్, సుచిత్ చెరో రెండు వికెట్లు తీశారు.
కాగా, 2016లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన కరుణ్ నాయర్ ఆరు టెస్టులు, రెండు వన్డేలు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఏడు ఇన్నింగ్స్‌ల్లో 62 సగటుతో 374 పరుగులు చేశాడు. చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో అజేయంగా ట్రిపుల్ సెంచరీ బాదాడు. భారత త్రిశతక వీరుడిగా వీరేంద్ర సెహ్వాగ్ సరసన కరుణ్ నాయర్ నిలిచాడు. కానీ ఆ తర్వాత మూడు టెస్టులే ఆడిన కరుణ్ నాయర్ భారత జట్టులో చోటు కోల్పోయాడు.
ప్రస్తుతం కరుణ్ నాయర్ ఐపీఎల్‌లోనూ ఆడట్లేదు. చివరిగా 2022లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. అయితే విదర్భకు వెళ్లిన అతను గత రంజీ సీజన్‌లో ఆకట్టుకున్నాడు. 690 పరుగులు చేసి తమ జట్టును సెమీస్‌కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు.
Captain leading from the front! 🫡
— Star Sports (@StarSportsIndia) August 19, 2024
Watch #KarunNair’s unbeaten knock of 124* from just 48 deliveries as they post an above par total against the Mangaluru Dragons! 🔥
Don't miss 👉🏻 #MaharajaTrophyOnStar | LIVE NOW | Star Sports Network pic.twitter.com/h8NK1EBR26