
జోధ్‌పూర్‌లో జన్మించిన కరుణ్ నాయర్
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మలయాళీ దంపతులకు డిసెంబర్ 6, 1991న కరుణ్ నాయర్ జన్మించాడు. మొదట అతను కర్ణాటక తరఫున అండర్-15 క్రికెట్ ఆడాడు. అనంతరం కర్ణాటక నుంచే అండర్ 19 జట్టులో చోటు సాధించాడు.

2013లో రంజీ ట్రోఫీలో అరంగేట్రం
స్వతహాగా కుడి చేతి వాటం బ్యాట్స్ మెన్ అయిన కరుణ్ నాయర్ 2012లో విజయ్ హజారే ట్రోఫీలో ఆడటం ద్వారా దేశీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. పంజాబ్‌కు వ్యతిరేకంగా 2013లో రంజీ ట్రోఫీలో కర్ణాటక తరఫున ఆడాడు.

రంజీల్లో అత్యధిక పరుగులు
2014-15 రంజీ ట్రోపీ సీజన్‌లో కరుణ్ నాయర్ 47.26 సగటుతో 700 పరుగులు చేశాడు. కర్ణాటక మరోసారి రంజీ ట్రోపీ నిలబెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో రాబిన్ ఉతప్ప, కేఎల్ రాహుల్ తర్వాత కర్ణాటక తరఫున అత్యధిక పరుగులు చేసింది బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డేవిల్స్
2016లో ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డేవిల్స్ తరఫున ఆడిన కరుణ్ నాయర్ సత్తా చాటాడు. ఢిల్లీ తరఫున రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

జింబాబ్వేతో 2016 మ్యాచ్‌లో అరంగేట్రం
2016లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కరుణ్ నాయర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

ఇంగ్లాండ్ సిరిస్‌లో టెస్టుల్లోకి అరంగేట్రం
ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆడటం ద్వారా అతను టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. మొహాలి టెస్టులో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన కరుణ్ నాయర్ ఆ తర్వాత ముంబైలో జరిగిన నాలుగో టెస్టులో సత్తా చాటలేకపోయాడు. అయితే చెన్నై టెస్టులో అందివచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు.

ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడు
టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా కరుణ్ నాయర్ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా టెస్టుల్లో తన తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మలిచిన తొలి భారతీయ ఆటగాడిగా మరో రికార్డు సృష్టించాడు.


Click it and Unblock the Notifications