న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బోర్డు ప్రెసిడెంట్స్‌ జట్టుకు కెప్టెన్‌గా నాయర్: ఆంధ్ర క్రికెటర్ విహారికి చోటు

Karun Nair To Lead Board Presidents XI In West Indies Warm Up Game
Karun Nair to lead Board Presidents XI in warm-up game against West Indies

హైదరాబాద్: సెప్టెంబర్‌లో భారత పర్యటనకు రానున్న వెస్టిండీస్‌ జట్టుతో వార్మప్ మ్యాచ్ కోసం బీసీసీఐ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవెన్ జట్టును శుక్రవారం ప్రకటించింది. మొత్తం 13 మందిని సీనియర్ సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ జట్టుకు కరుణ్ నాయర్ నాయకత్వం వహించనున్నాడు.

భారత్ Vs విండిస్: 22 నుంచి రాజ్‌కోట్ టెస్టు టికెట్ అమ్మకాలుభారత్ Vs విండిస్: 22 నుంచి రాజ్‌కోట్ టెస్టు టికెట్ అమ్మకాలు

వడోదర వేదికగా సెప్టెంబర్ 29, 30 తేదీల్లో రెండు రోజుల పాటు వెస్టిండిస్ జట్టుతో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు తలపడనుంది. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, శ్రేయాస్ అయ్యర్ జట్టుకు ఎంపికయ్యారు.

హనుమ విహారికి జట్టులో చోటు

హనుమ విహారికి జట్టులో చోటు

ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఐదో టెస్టులో అరంగేట్రం చేసిన ఆంధ్ర యువ క్రికెటర్ హనుమ విహారి సైతం ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. వెస్టిండిస్ జట్టు భారత పర్యటనలో భాగంగా రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది.

ప్రారంభమైన రాజ్‌కోట్ టెస్టు టికెట్ అమ్మకాలు

ప్రారంభమైన రాజ్‌కోట్ టెస్టు టికెట్ అమ్మకాలు

భారత్-విండిస్ జట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా అక్టోబరు 4 నుంచి ప్రారంభంకానున్న తొలి టెస్టు మ్యాచ్ టికెట్ అమ్మకాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ (ఎస్‌సీఏ) గురువారం ఓ ప్రకటనని విడుదల చేసింది. తొలి టెస్టుకి సంబంధించిన కొన్ని టికెట్లను ఇప్పటికే ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నట్లు వెల్లడించిన ఎస్‌సీఏ.. అందుబాటులో ఉన్న రెండు కార్పొరేట్ బాక్స్‌ టికెట్ల ధరలను కూడా ప్రకటించింది.

సౌత్ పెవిలియన్‌ కార్పొరేట్ బాక్స్‌ ధర రూ.7 వేలు

సౌత్ పెవిలియన్‌ కార్పొరేట్ బాక్స్‌ ధర రూ.7 వేలు

సౌత్ పెవిలియన్‌ కార్పొరేట్ బాక్స్‌ ధర రూ.7 వేలు, వెస్ట్ స్టాండ్ కార్పొరేట్ బాక్స్ ధర రూ. 4 వేలుగా సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ (ఎస్‌సీఏ) నిర్ణయించింది. స్టేడియంతో పాటు రాజ్ కోట్ సిటీలో మొత్తం ఐదు చోట్ల టికెట్ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

సెప్టెంబర్ 28తో ముగియనున్న ఆసియా కప్

సెప్టెంబర్ 28తో ముగియనున్న ఆసియా కప్

ఈ టికెట్లను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు క్రికెట్ అభిమానులు కొనుగోలు చేయొచ్చు. అనంతరం 12 నుంచి 16 వరకు హైదరాబాద్‌ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో భారత్ ఆడుతోంది. ఈ ఆసియా కప్ టోర్నీ సెప్టెంబర్ 28తో ముగియనుంది.

జట్టు వివరాలు: కరుణ్ నాయర్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, హనుమ విహారి, శ్రేయాస్ అయ్యర్, అంకిత బావ్నె, ఇషాన్ కిషన్, జలజ్ సక్సేనా, సౌరభ్ కుమార్, బాసిల్ థంపీ, అవేశ్ ఖాన్, విఘ్నేశ్, ఇషాన్ పోరెల్.

Story first published: Saturday, September 22, 2018, 10:21 [IST]
Other articles published on Sep 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X