Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'అవకాశం వచ్చినప్పుడు బ్యాట్‌తోనే సమాధానం చెప్తా'

India Vs West Indies : Karan Nair Talks About Team's Decision
 Karun Nair lashes out at team management for not communicating with him about non-selection

న్యూ ఢిల్లీ: వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు దూరమైన కరుణ్ నాయర్ జాతీయ జట్టులో పునారగమనంపై దీటుగా స్పందించాడు. జట్టుకు దూరమవడం అనేది సహజంగా ఎవరికైనా బాధ కల్గిస్తుంది, దీన్ని అధిగమించడం కష్టం కావచ్చు. నన్ను తప్పియడానికి తీసుకున్న నిర్ణయంలో టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు ప్రతి ఒక్కరూ పాలుపంచుకున్నారు. ఓ ఆటగానిగా వారి నిర్ణయానికి తలొగ్గడం తప్పా..ఏమి చేయలేని పరిస్థితి. అవకాశం ఎప్పుడు వచ్చినా బ్యాటుతోనే సమాధానం చెబుతా అని కరుణ్ అన్నాడు.

పూర్తి ఫిట్‌నెస్ ఉంటేనే జట్టులో చోటు

పూర్తి ఫిట్‌నెస్ ఉంటేనే జట్టులో చోటు

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు పఠిస్తున్న మంత్రం ఫిట్‌నెస్. పూర్తి ఫిట్‌నెస్ ఉంటేనే జట్టులో చోటు లేకుంటే ఆశలు వదులుకోవాల్సిందే. ఇలా సరైన ఫిట్‌నెస్ లేక జట్టుకు దూరమైన వారు ఎందరో. ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసం నిర్వహించిన యో-యో ఫిట్‌నెస్ పరీక్షలో అంబటి రాయుడు విఫలమై చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే.

కెప్టెన్ కోహ్లీకు మించినోడు

కెప్టెన్ కోహ్లీకు మించినోడు

పరుగులు, వికెట్లు ఎన్ని అనేది ఇక్కడ ముఖ్యం కాదు ఫిట్‌నెస్ ఉందా లేదా అన్నదే ప్రధానంగా మారింది ఇప్పుడు. జట్టుకు ఫిట్‌నెస్‌ను పరిచయం చేసిన కెప్టెన్ కోహ్లీనే ఇన్నాళ్లు టాప్ అనుకున్నాం కానీ..కరుణ్ నాయర్ అంతకు మించినోడు అని తాజాగా తెలిసింది. ఈ మాట అన్నది మరెవరో కాదు ఫిట్‌నెస్‌కు సరికొత్త నిర్వచనమిచ్చిన టీమ్‌ఇండియా ట్రైనర్ శంకర్ బసు.

అత్యుత్తమ ఫిట్‌నెస్ కల్గిన ఆటగానివని

అత్యుత్తమ ఫిట్‌నెస్ కల్గిన ఆటగానివని

ప్రముఖ మీడియాతో కరుణ్ మాట్లాడుతూ 'ఫిట్‌నెస్ ట్రైనర్ శంకర్ సార్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ బంగర్‌తో చాలా సమయం గడిపేవాడిని. నెట్ ప్రాక్టీస్‌లో త్రోడౌన్స్ ఆడేవాన్ని. కానీ ఎక్కువలో ఎక్కువగా బసుతో ఉండేవాన్ని. ప్రస్తుత భారత జట్టులో నువ్వో అత్యుత్తమ ఫిట్‌నెస్ కల్గిన ఆటగాడివని సర్ అంటుండేవాడు. దీనికి నేను ఎంతగానో గర్వపడుతున్నాను, భవిష్యత్తులో ఇంతే ఫిట్‌గా ఉండాలనుకుంటున్నాను' అని కరుణ్ అన్నాడు.

ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో

ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో

ఇటీవలే ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో కరుణ్ సభ్యుడు. కానీ ఏ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం దక్కలేదు. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ప్రయోగాల పేరిట మ్యాచ్ మ్యాచ్‌కు జట్టును మార్చే కెప్టెన్ కోహ్లీకి తోడు టీమ్ మేనేజ్‌మెంట్ అనాలోచిత నిర్ణయాలకు నాయర్ బలి అయ్యాడు.

Story first published: Monday, October 1, 2018, 10:44 [IST]
Other articles published on Oct 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+