For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KA 03 NA 303: నాయర్ స్పెషల్ నెంబర్ ప్లేట్, ఏంటీ ప్రత్యేకత

కరుణ్ నాయర్ క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో సెహ్వాగ్‌ తర్వాత భారత్‌ తరఫున ట్రిపుల్‌ సెంచరీ సాధించిన రెండో ఆటగాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: కరుణ్ నాయర్ క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో సెహ్వాగ్‌ తర్వాత భారత్‌ తరఫున ట్రిపుల్‌ సెంచరీ సాధించిన రెండో ఆటగాడు. తాజాగా కరుణ్ నాయర్ కొత్త కారుని కొనుగోలు చేశాడు. తాను కొనుగోలు చేసిన ఫోర్డ్‌ ముస్టాగ్‌ కారు ఫోటోను అభిమానుల కోసం ఇది 'నా వాలెంటైన్‌' అని ట్వీట్‌ చేశాడు.

చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి టెస్టులో 303 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తాను ఎంతో ముట్టటపడి కొనుకున్న కారుకి ఇదే నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. మీరు సరిగ్గా గమనిస్తే ఇందులో కనిపించే ఇంగ్లిష్‌ అక్షరాలలో కూడా ఈ విషయం దాగి ఉంది.

Karun Nair has a Ford Mustang and a special number-plate

కరుణ్ నాయర్‌లోని మొదటి రెండు ఆంగ్ల అక్షరాలు 'కేఏ', అనంతరం '03' సంఖ్య, నాయర్‌లోని మొదటి ఆంగ్ల అక్షరాలు 'ఎన్‌ఏ' తర్వాత తన వ్యక్తిగత అత్యధిక స్కోరు '303' కొత్త కారు నంబర్‌ ప్లేట్‌పై ఉంది. కేఏ అంటే కర్నాటక మాత్రమే కాదు.. కరుణ్‌ పేరులో మొదటి రెండక్షరాలు కూడా ఉన్నాయి.

ఇక జిల్లా కోడ్‌కు సంబంధించిన దాంట్లో ఎన్‌ఏ అక్షరాలున్నాయి. అంటే నాయర్‌లో తొలి రెండు అక్షరాలు కలిసివస్తున్నాయి. ఇలా తాను సాధించిన చరిత్రాత్మక ఇన్నింగ్స్‌కు గుర్తుగా కరుణ్ నాయర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం విశేషం.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+