Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

34 రన్స్ వద్ద కుక్ ఇచ్చిన లైఫ్‌తోనే నాయర్ ట్రిపుల్ సెంచరీ

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో చెన్నై వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా రికార్డుల మోత మోగించింది. తన కెరీర్‌లో ఆడుతున్న మూడో టెస్టు సిరిస్‌లోనే టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కరుణ్‌ నాయర్‌ (381 బంతుల్లో 303 నాటౌట్‌; 32 ఫోర్లు, 4 సిక్సర్లు) సాయంతో ట్రిపుల్ సెంచరీ సాధించాడు.

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కే సాధ్యం కాని అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఇప్పటివరకు భారత క్రికెట్ చరిత్రలోనే ఒకే ఒక్కరు సాధించిన అరుదైన ట్రిపుల్ సెంచరీ రికార్డుని కరుణ్ నాయర్ సాధించి చరిత్ర సృష్టించాడు. అంతేకాదు తన తొలి సెంచరీనే ట్రిపుల్ సెంచరీగా మలచిన తొలి భారత క్రికెటర్‌.

అంతేకాదు టెస్టుల్లో సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. చెన్నై టెస్టులో కరుణ్ నాయర్‌ ట్రిపుల్ సెంచరీ సాధించడంలో అదృష్టం కూడా కలిసొచ్చిందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఐదో టెస్టుకు ముందు నాయర్ స్థానంలో మనీష్ పాండేకి తుది జట్టులో చోటు కల్పించాలనే వాదన వచ్చిందట.

అందుకు కారణం లేకపోలేదు. మొహాలి, ముంబై టెస్టుల్లో కరుణ్ నాయర్ ఘోరంగా విఫలం కావడమే. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొహాలీ టెస్టుల ద్వారా అరంగేట్రం చేసిన నాయర్ ఆ తర్వాత ముంబైలో జరిగిన నాలుగో టెస్టు కూడా ఆడాడు. ఆ రెండు టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌లు ఆడిన ఆశించిన మేరకు రాణించలేదు.

 karun nair gets a life at 30 score in chennai test

దీంతో నాయర్ స్థానంలో మనీష్ పాండేకు అవకాశం కల్పించాలనే అనుకున్నారంట. అయితే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను ఇంకో టెస్టు మిగిలుండగానే భారత్ సిరిస్‌ను కైవసం చేసుకోవడంతో చివరిదైన చెన్నై టెస్టు నామ మాత్రపు టెస్టే కావడంతో ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తారనే అంతా భావించారు.

ఇందులో భాగంగానే కర్ణాటకకు ఈ చెందిన ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌పై నమ్మకం ఉంచిన అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లిలు మళ్లీ మరొక అవకాశం ఇచ్చారు. తనకు అందివచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్న నాయర్ ఐదో టెస్టులో ట్రిపుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు.

ఇక నాయర్‌కు కలిసొచ్చిన రెండో అదృష్టం ఏమిటంటే భారత తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా మూడో రోజు ఆటలో నాయర్ 34 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇన్నింగ్స్ 85 ఓవర్‌లో బౌలర్ బాల్ వేసిన బంతిని ఆడటంలో కరుణ్ నాయర్ కాస్తంత తడబడ్డాడు. కొద్దిగా స్వింగ్ అవుతూ వచ్చిన బంతిని నాయర్ గట్టిగా కొట్టాడు.

ఆ క్రమంలోనే బంతి ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కుక్ చేతుల్లోంచి దాటుకుని బౌండరీకి తరలిపోయింది. అదే కుక్ అప్రమత్తంగా ఉండి ఉంటే క్యాచ్ ను పట్టుకోని ఉండి ఉంటే నాయర్ 34 పరుగుల వద్దే పెవిలియన్‌కు చేరి ఉండేవాడు. అయితే అజాగ్రత్తగా నాయర్ క్యాచ్‌ని వదిలేసిన కుక్ సేన భారీ మూల్యం చెల్లించుకుంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+