Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ 2018: ఏ ఆటగాడు అందుకోని ఘనత సాధించిన కర్ణ్ శర్మ

Karn Sharma won back to back three ipl titles with three different teams.

హైదరాబాద్: హైదరాబాద్: ఐపీఎల్ 2018 సీజన్ ఆదివారంతో ముగిసింది. టోర్నీలో భాగంగా ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన పైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన చెన్నై ముచ్చటగా మూడోసారి కప్‌ను ముద్దాడింది.

రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్ టోర్నీలోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో టైటిల్ విజేతగా నిలవడంతో ఆ జట్టులోని ఆటగాడు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వరుసగా మూడుసార్లు ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచిన జట్లకు ప్రాతినిథ్యం వహించిన ఆటగాడిగా కర్ణ్‌ శర్మ నిలిచాడు. 2016, 2017, 2018లో విజేతగా నిలిచిన జట్ల తరుపున కర్ణ్‌ శర్మ ప్రాతినిధ్యం వహించాడు.

ఐదు మ్యాచ్‌లాడి ఒక్క వికెట్ కూడా తీయలేదు

ఐదు మ్యాచ్‌లాడి ఒక్క వికెట్ కూడా తీయలేదు

2016లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు కర్ణ్ శర్మ ప్రాతినిథ్యం వహించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 8 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆ సీజన్లో ఐదు మ్యాచ్‌లు ఆడిన శర్మకు ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు.

రూ.5 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం

రూ.5 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం

ఆ తదుపరి ఏడాది సన్‌రైజర్స్‌ కర్ణ్‌ శర్మను వేలానికి వదిలేసింది. దీంతో 2017 ఐపీఎల్‌ కోసం నిర్వహించిన వేలంలో కర్ణ్ శర్మను రూ.5 కోట్లకు ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకుంది. ముంబై తరఫున 9 మ్యాచ్‌లాడిన శర్మ 13 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. పూణెతో జరిగిన ఫైనల్లో ముంబై విజయం సాధించి మూడోసారి టైటిల్‌‌ని కైవసం చేసుకుంది. పూణెతో జరిగిన ఫైనల్లో కర్ణ్ శర్మ 18 పరుగులు ఇచ్చాడు.

6 మ్యాచ్‌లాడిన 4 వికెట్లు తీసిన కర్ణ్ శర్మ

6 మ్యాచ్‌లాడిన 4 వికెట్లు తీసిన కర్ణ్ శర్మ

ఆ తర్వాత 2018 సీజన్ కోసం బెంగళూరు వేదికగా నిర్వహించిన ఐపీఎల్ వేలంలో కర్ణ్ శర్మను చెన్నై సూపర్‌కింగ్స్‌ సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో మొత్తం 6 మ్యాచ్‌లాడిన కర్ణ్ శర్మ 4 వికెట్లు పడగొట్టాడు. ముంబైలోని వాంఖడె వేదికగా సన్‌రై‌జర్స్ హైదరాబాద్‌తో జరిగిన పైనల్లో కర్ణ్ శర్మ 3 ఓవర్లు వేసి ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

ఏ ఆటగాడు అందుకోని అరుదైన ఘనత

ఏ ఆటగాడు అందుకోని అరుదైన ఘనత

దీంతో కర్ణ్‌ శర్మ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఏ ఆటగాడు అందుకోని ఘనతను అందుకున్నాడు. వరుసగా మూడేళ్లు ట్రోఫీ గెలిచిన జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇదిలా ఉంటే 11 సీజన్ల ఐపీఎల్ చరిత్రలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీని గెలవక పోవడం విశేషం.

Story first published: Monday, May 28, 2018, 19:30 [IST]
Other articles published on May 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+