Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ టెండూల్కర్, ధోనీలపై విరుచుకుపడిన కపిల్

Kapil Dev
చెన్నై: ఇంగ్లాండుపై భారత్ ఘోర పరాజయాలు చవిచూస్తున్న నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సచిన్ టెండూల్కర్‌లపై మండిపడ్డారు. టీమ్ స్పిరిట్ లోపించిందని ఆయన విమర్శించారు. జట్టులోని యువకులను ప్రోత్సహించడంలో ధోనీ, టెండూల్కర్ విఫలమయ్యారని ఆయన అన్నారు. భారత్ జట్టుగా ఆడడం లేదని, తాను ఎవరినీ వ్యక్తిగతంగా నిందించదలుచుకోలేదని, వాళ్లు మితిమీరిన క్రికెట్ ఆడారని ఆయన అన్నారు.

ప్రపంచ కప్ గెలిచిన నాలుగు రోజులకే ఐపియల్ ఆడాల్సి వచ్చిందని, ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటన, అనంతరం ఇంగ్లాండు పర్యటన, భారత క్రికెటర్లు కదలికపై ఆటపై కన్నా ఎక్కువ శ్రద్ధ చూపాల్సి వస్తోందని ఆయన అన్నారు. యువకులను ముందుకు నడిపించడంలో సీనియర్లు విఫలమయ్యారని ఆయన అన్నారు. ఏ సీనియర్ కూడా యువ బౌలర్ల వద్దకు ఎలా బౌలింగ్ చేయాలో సూచించిన దాఖలాలు లేవని ఆయన అన్నారు. ధోనీ ఇషాంత్ వద్దకు వెళ్లి మాట్లాడాల్సిందని ఆయన అన్నారు.

తాము ఏం చేయాలో తెలుసుకుని వ్యవహరించే స్థాయికి భారత క్రీడాకారులు ఎదగలేదని ఆయన అన్నారు. ఇప్పటికీ కెప్టెన్ వైపు, సీనియర్ల వైపు చూస్తుంటామని ఆయన అన్నారు. ఎవరో ఒకరు దూకుడుగా వ్యవహరించాల్సి ఉంటుందని, సీనియర్లు ఎంతగా సీనియర్లయ్యారంటే వారు దూకుడుగా ఉండకూడదని అనుకునే దాకా అని ఆయన వ్యాఖ్యానించారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+