Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్థాన్ వెళ్లి కష్టాలు కొని తెచ్చుకున్న కపిల్ శర్మ

Kapil Sharma faces severe criticism for promoting PSL franchise Peshawar Zalmi: Twitter reactions

హైదరాబాద్: ఇండియన్ పాపులర్ కమెడియన్‌కు మళ్లీ చిక్కులు వచ్చి పడ్డాయి. రాజకీయ కారణాలతో పాకిస్థాన్ జట్టుతో క్రికెట్ ఆడేందుకు భారత్ సుముఖత చూపించట్లేదు. అలాంటిది పాకిస్థాన్ నిర్వహిస్తోన్న పాకిస్థాన్ సూపర్ లీక్(పీఎస్ఎల్)కు ఇండియన్ హాజరైతే.. . ఆ కారణంతోనే నెటిజన్లు కపిల్ శర్మపై విరుచుకుపడుతున్నారు. కేవలం హాజరవడమే కాదు. దాని ప్రమోషన్‌లో భాగంగా ఓ షోను సైతం చేశాడు.

దానికి మెచ్చుకోలుగా వెస్టిండీస్ ఆల్ రౌండర్, జల్మీ జట్టు కెప్టెన్ డారెన్ సమీ, పాకిస్థాన్ క్రికెటర్ కమ్రన్ అక్మల్, మొహమ్మద్ హఫీజ్ అభినందించారు. పీఎస్ఎల్ రెండ్రోజుల్లో అంటే ఫిబ్రవరి 22న మొదలవబోతుండగా ప్రమోషనల్ కార్యక్రమం చేపట్టారు. కపిల్ అతని సోదరులు కలిసి కార్యక్రమానికి హాజరైయ్యారు.

అక్కడకు విచ్చేసిన జట్టు బ్యానర్‌లను పట్టుకుని ఫొటోలకు ఫోజులివ్వడంతో నెటిజన్లు ట్విట్టర్ ఫైర్ అందుకున్నారు. కపిల్ పాకిస్థాన్ అభిమానులు మాత్రం అతని రాకపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్లలో చాలామంది వరకు పాకిస్థాన్ నుంచి దిగుమతి అయిన వారే కావడం గమనార్హం.

భారత్, పాకిస్థాన్ ల మధ్య రాజకీయ కారణాల రీత్యా ద్వైపాక్షిక సిరీస్‌ను 2013 నుంచి ఆడటం మానేసింది. ఇక పాకిస్థాన్ ఆటగాళ్లను 2009 నుంచి ఐపీఎల్ తీసుకునేందుకు నిరాకరించింది.

Story first published: Friday, February 23, 2018, 13:00 [IST]
Other articles published on Feb 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+