'ఐపీఎల్‌లో కపిల్ దేవ్ రూ.25కోట్లు వరకూ పలుకుతాడట!!'

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ ప్రస్తుత ఐపీఎల్ వేలంలో ఉంటే రూ.25 కోట్లు తగ్గకుండా పలికేవాడని మాజీ క్రికెటర్ సునీల్ గావాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఆజ్‌తక్ చానెల్ నిర్వహించిన ఓ కార్యక్రమానిక హాజరైన ఈ దిగ్గజ క్రికెటర్లు సరదాగా నాటి రోజులను నెమరువేసుకున్నారు. కపిల్‌దేవ్ గొప్ప ఆటగాడని ఈ సందర్భంగా సునీల్ గవాస్కర్ కొనియాడాడు. కపిల్ జింబాంబ్వేపై ఆడి 175 పరుగులు చేయడంతో ఇన్నింగ్స్‌ను గెలిపించాడన్నాడు. అటువంటి ఆటను మళ్లీ తాను ఇంతవరకు చూడలేదని చెప్పుకొచ్చాడు.

70 లేక 80 పరుగులు కూడా వస్తాయనుకోలేదు
‘ఓ ఆటగాడిగా.. కామెంటేటర్‌గా వన్డే చరిత్రలోనే అదో గొప్ప ఇన్నింగ్స్. మళ్లీ ఇంతవరకు అలాంటి గొప్ప ఇన్నింగ్స్ చూడలేదు. ఆ మ్యాచ్ ఆరంభంలోనే తడబడ్డ మేం.. 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయాం. అప్పుడు చాలా చలిగా ఉంది. అంతేకాకుండా బంతి కూడా బాగా తిరిగింది. ఈ పరిస్థితుల్లో 70 లేక 80 పరుగులు కూడా చేస్తామనుకోలేదు. కానీ కపిల్ అద్బుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు. అతనేం నెమ్మదిగా ఆడలేదు. సిక్సర్లతో చెలరేగాడు. ఇటువంటి ప్లేయర్ తాజా ఐపీఎల్ వేలంలో ఉంటే మాత్రం.. కచ్చితంగా రూ.25 కోట్లు వరకూ పలికేవాడు.' అని ఈ సన్నీ చెప్పుకొచ్చాడు.

అంత డబ్బును ఊహించలేదు
ఈ వ్యాఖ్యలపై కపిల్ నవ్వుతూ.. ఇంత వరకు అంత డబ్బును ఊహించలేదని కొట్టిపడేశాడు. దానికి స్పందిస్తూ.. గవాస్కర్ మాత్రం అది కవిల్ విలువ అని స్పష్టం చేశాడు. ఆల్‌రౌండర్ అయిన కపిల్.. 225 వన్డేల్లో 3783 పరుగులతో పాటు 253 వికెట్లు పడగొట్టాడు. ఇక భారత్‌కు ప్రపంచకప్ అందించిన తొలి కెప్టెన్ కూడా కపిలేనన్న విషయం తెలిసిందే.

2019సీజన్‌కు వేలంలో 60మంది
ఐపీఎల్- 2019 సీజన్ కోసం మంగళవారం జరిగిన వేలంలో 351 ఆటగాళ్లలో 60 మందిని 8 ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. అనూహ్య రీతిలో రాజస్థాన్ రాయల్స్ మరోసారి పేసర్ ఉనాద్కత్‌ను దక్కించుకునేందుకు భారీ మొత్తంలో వెచ్చించడంతో వేలం అధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు. అతనితో పాటుగా అంతే ధరకు కోల్‌కతా నైట్ రైడర్ యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని రూ.8.4 కోట్లకు సొంతం చేసుకుని ఐపీఎల్‌కు ఘన స్వాగతం పలికింది. మిగిలిన భారత ఆటగాళ్లలో విహారి రూ.2 కోట్లు, ఇషాంత్ రూ.1.1 కోట్లు, షమీ రూ.4.8 కోట్లతో ఉన్నారు.

ఒక్క కోటికే ముంబైకు దక్కిన యువీ
వేలంలో ఎవరైనా కొనుగోలు చేస్తారా అనే సందేహానికి తెరదించుతూ రెండో రౌండ్‌లో యువరాజ్ సింగ్‌ను ముంబై ఇండియన్స్ కనీసధర రూ.కోటికి సొంతం చేసుకుంది. 2015 ఐపీఎల్ వేలంలో రూ. 16 కోట్లకి అమ్ముడుపోయి రికార్డులు నెలకొల్పిన యువరాజ్ సింగ్.. గత మూడు సీజన్లలోనూ అంచనాల్ని అందుకోలేకపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications