న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాకు కొత్త కోచ్‌ని ఎంపిక చేసేది ఎవరో తెలుసా?

Kapil Dev To Head The Three-Member Panel To Pick India Head Coach || Oneindia Telugu
Kapil Dev to head the three-member panel to pick India head coach

హైదరాబాద్: టీమిండియా కొత్త కోచ్‌ను కపిల్ దేవ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ ఎంపిక చేయనుంది. టీమిండియా హెడ్ కోచ్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కు సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) మంగళవారం దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, టీమిండియా మాజీ ఓపెనర్ అన్షుమన్ గైక్వాడ్, భారత మహిళల మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామిలతో కూడిన ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ టీమిండియా కొత్త కోచ్‌ని ఎంపిక చేయనుంది. ఈ మేరకు సుప్రీం కోర్టు నేతృత్వంలోని సీఓఏ నిర్ణయం తీసుకుంది.

ముగిసిన రవిశాస్త్రి పదవీ కాలం!

ముగిసిన రవిశాస్త్రి పదవీ కాలం!

ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రితో పాటు సపోర్టింగ్ స్టాఫ్ పదవీ కాలం ప్రపంచకప్‌తో ముగిసింది. అయితే, త్వరలో టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో వారి పదవీ కాలాన్ని 45 రోజులకు బీసీసీఐ గడువు పెంచింది. ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హర్ట్‌, స్ట్రెంగ్త్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌ శంకర్‌ బసు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేయడంతో వారి స్థానాల్లో కొత్తవారిని నియమించే అవకాశం ఉంది.

వెస్టిండిస్ పర్యటన ముగిసిన తర్వాత

వెస్టిండిస్ పర్యటన ముగిసిన తర్వాత

వెస్టిండిస్ పర్యటన ముగిసిన తర్వాత భారత పర్యటకు దక్షిణాఫ్రికా జట్టు రానుంది. భారత్‌లో సఫారీల పర్యటన సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్‌‌తో పాటు బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌, స్ట్రెంగ్త్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌లు, ఫిజియో థెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ను తిరిగి నియమించనున్నట్లు బీసీసీఐ పేర్కొంది.

దరఖాస్తులను అహ్వానించిన బీసీసీఐ

దరఖాస్తులను అహ్వానించిన బీసీసీఐ

ఇప్పటికే పైన పేర్కొన్న అన్ని పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే, ఈ సారి కొత్తగా వయసుతో పాటు అనుభవాన్ని కొలమానంగా తీసుకోవాలంటూ ఐసీసీ కొత్త నిబంధనలను విధించింది. కోచ్ పదవి అభ్యర్థులకు కనీసం రెండేళ్ల అంతర్జాతీయ అనుభవంతో పాటు వయసు 60 ఏళ్లకు మించరాదని అందులో పేర్కొంది.

ఆఖరు తేదీ జులై 30

ఆఖరు తేదీ జులై 30

ఆసక్తి కలిగిన అభ్యర్దులు జులై 30, సాయంత్రం ఐదు గంటల్లోగా దరఖాస్తులు అందజేయాలని బీసీసీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా, రవిశాస్త్రిని 2017లో కోచ్‌గా క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఎంపిక చేసింది. ఆ కమిటీలో మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌవర్ గంగూలీలు ఉన్నారు.

జాతీయ సెలక్లర్లను సైతం ఇదే ప్యానెల్

జాతీయ సెలక్లర్లను సైతం ఇదే ప్యానెల్

అయితే, పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి రావడంతో ఈ ముగ్గురి స్థానంలో బీసీసీఐ ఇప్పుడు కొత్త కమిటీని వేసింది. మరోవైపు హెడ్ కోచ్, సపోర్టింగ్ స్టాఫ్‌తో పాటు ఐదుగురు సెలక్టర్లతో కూడిన జాతీయ సెలక్షన్ కమిటీని కూడా ఈ ప్యానెల్ ఎంపిక చేయనుంది.

Story first published: Wednesday, July 17, 2019, 15:27 [IST]
Other articles published on Jul 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X