ఐపీఎల్ 2019: కపిల్‌దేవ్‌కి నచ్చిన ఆల్‌రౌండర్ ఎవరో తెలుసా?

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019వ సీజన్ రెండో వారంలోకి ప్రవేశించడంతో అందరూ ఆసక్తిగా మ్యాచ్‌లను వీక్షిస్తున్నారు. అదే సమయంలో మాజీ క్రికెటర్ల మాత్రం యువ క్రికెటర్లపైనే ఉంది. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌లో భారత జట్టు తరఫున నాలుగో స్థానంలో ఏ బ్యాట్స్‌మెన్ ఎంపికవుతాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

నాలుగో నంబర్ స్థానంపై
తాజాగా టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ నాలుగో నంబర్ స్థానంపై స్పష్టతనిచ్చారు. బ్రిటానియా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ దేవ్ జట్టు పరిస్థితులను బట్టి ఏ స్థానంలోనైనా ఆడేందుకు ఆటగాళ్లు సిద్ధంగా ఉండాలని తెలిపాడు. జట్టు అవసరాల దృష్ట్యా బ్యాటింగ్ స్థానాలను నిర్ణయించాలని కపిల్ దేవ్ సూచించాడు.

ఆయోమయానికి గురికావొద్దు
ఈ విషయంలో ఆటగాళ్లు అనవసరంగా ఆయోమయానికి గురికావొద్దని సూచించాడు. అంతా కలిసి ఒక జట్టులాగా ఆడాలని, నంబర్ల గురించి మాట్లాడటం మంచిదికాదని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు. "నాలుగో స్థానం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. పరిస్థితులను కూడా చూడాలి. ఆటగాళ్లను నంబర్లతో అయోమయానికి గురిచేయొద్దు. ఎవరైనా ఏ స్థానంలోనైనా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉండాలి" అని కపిల్ అన్నాడు.

పంత్ గురించి కపిల్ దేవ్
ఇక, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గురించి కపిల్ దేవ్ మాట్లాడుతూ "పంత్ ఇంకా నిరూపించుకోవాల్సింది చాలా ఉంది. రాబోయే తరాల ఆటగాళ్లు ధోని స్థాయిలో ఆడేందుకు ప్రయత్నించాలి. ధోనీని అందుకునే సత్తా పంత్‌కు ఉంది" అని అన్నాడు. మీకు నచ్చిన ఆల్‌రౌండర్లు ఎవరూ? అని కపిల్‌ను ప్రశ్నించగా తనదైన శైలిలో స్పందించాడు.

నాకు నచ్చిన ఆల్ రౌండర్ ధోని
తనకు నచ్చిన ఆల్‌రౌండర్ మహేంద్ర సింగ్ ధోనీ అని చెప్పాడు. బౌలింగ్, బ్యాటింగ్ చేసేవాళ్లే ఆల్‌రౌండర్లా? అని ఆయన అన్నారు. టెస్ట్ క్రికెట్‌లో రవిచంద్రన్ అశ్విన్ మంచి ఆల్‌రౌండర్ అని చెప్పిన కపిల్ దేవ్.... ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఆల్‌రౌండర్లలో ఉత్తమం ఎవరని అడిగితే బెన్‌స్టోక్స్ పేరు చెప్తా అని కపిల్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications