Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rishabh Pant: డ్రైవర్‌ను పెట్టుకోవచ్చుగా.. పంత్ యాక్సిడెంట్‌పై మాజీ లెజెండ్ షాకింగ్ కామెంట్స్

Kapil Dev Shocking comments on Rishabh Pant accident

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు ఘోరమైన యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే. కొత్త ఏడాదిలో తల్లిని సర్‌ప్రయిజ్ చేసేందుకు కారులో పంత్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవ్ చేస్తున్న రిషభ్ పంత్ నిద్రమత్తులో తూలడంతోనే ప్రమాదం జరిగిందని ముందుగా అనుకున్నారు. అయితే రోడ్డుపై ఉన్న ఒక గుంతను తప్పించేందుకు పంత్ ప్రయత్నించినప్పుడు కారు అదుపు తప్పిందని ఆ తర్వాత తెలిసింది.

 తీవ్రంగా గాయపడిన పంత్

తీవ్రంగా గాయపడిన పంత్

ఈ ప్రమాదంలో పంత్ తల, కాళ్లు, చేతులు, వీపుపై తీవ్రమైన గాయాలయ్యాయి. వీటి నుంచి అతను కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని వైద్యులు అంటున్నారు. కనీసం ఆరు నెలలు పట్టొచ్చని కొందరు అంచనా వేశారు. ప్రమాదంలో గాయపడి కారు అద్దాల్లో నుంచి బయటకు వచ్చేందుకు పంత్ ప్రయత్నిస్తుండగా.. అటుగా వెళ్తున్న ఒక బస్సు డ్రైవర్ అతన్ని చూసి కాపాడాడు. ఈ ఘటనపై పలువురు క్రికెట్ ప్రముఖులు స్పందించారు. పంత్‌ను కాపాడిన బస్సు డ్రైవర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

కపిల్ దేవ్ షాకింగ్ కామెంట్స్

ఈ ఘటనపై టీమిండియా మాజీ లెజెండ్ కపిల్ దేవ్ స్పందించాడు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రమాదంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. అర్ధరాత్రి పూట, తెల్లవారు జామున ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగడం చూస్తూనే ఉంటాం. అలాంటి సమయంలో ఒక డ్రైవర్‌ను పెట్టుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగవని కపిల్ దేవ్ అన్నాడు. దీంతో పరోక్షంగా పంత్‌ను విమర్శించినట్లు ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. గతంలో కూడా పలువురు క్రీడాకారులపై నిర్మొహమాటంగా మాట్లాడిన కపిల్ దేవ్‌పై నెట్టింట తెగ ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.

డ్రైవర్‌ను పెట్టుకోవచ్చుగా..

డ్రైవర్‌ను పెట్టుకోవచ్చుగా..

పంత్‌కు జరిగిన ప్రమాదం గురించి మాట్లాడిన కపిల్ దేవ్... 'నీ దగ్గర మంచి కారుంది. అది చాలా వేగంగా వెళ్తుంది. అంతా బాగానే ఉంది కానీ.. మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక డ్రైవర్‌ను పెట్టుకోవడం పెద్ద కష్టం కాదు. నువ్వు ఒక్కడివే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు కదా. కొంత మందికి అదొక హాబీ అయితే ఇంకొందరికి అదొక ప్యాషన్.. ఇలాంటి విషయాలు నాక్కూడా తెలుసు. ఆ వయసులో ఇలాంటి కోరికలు సహజమే. కానీ మనపై కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. మనల్ని మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాని కోసం ఏం చేయాలో నువ్వు నిర్ణయించుకోవాలి' అని కరాఖండీగా చెప్పేశాడు.

తనకు జరిగిన యాక్సిడెంట్..

తనకు జరిగిన యాక్సిడెంట్..

పంత్ గురించి మాట్లాడుతుండగా తనకు జరిగిన మోటార్‌సైకిల్ ప్రమాదాన్ని కూడా కపిల్ దేవ్ గుర్తుచేసుకున్నాడు. 'ఇదొక గుణపాఠం. నేను కూడా అప్పుడప్పుడే క్రికెటర్‌గా ఎదుగుతున్న సమయంలో ఒక ప్రమాదానికి గురయ్యా. మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా ఆ ఘటన జరిగింది. ఇక అప్పటి నుంచి మా బ్రదర్ నన్ను కనీసం మోటార్‌బైక్ టచ్ కూడా చెయ్యనివ్వడు. ఏదేమైనా రిషభ్ పంత్ క్షేమంగా ఉన్నందుకు సంతోషం. అతన్ని కాపాడినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.

Story first published: Monday, January 2, 2023, 14:56 [IST]
Other articles published on Jan 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+