For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్‌కు డబుల్, ట్రిపుల్‌ సెంచరీలు చేయడం తెలీదు: కపిల్‌దేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Kapil Dev says Sachin Tendulkar did not know how to convert hundreds into 200s and 300s

ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌పై టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెంచరీలు ఎలా చేయాలో సచిన్‌కు తెలుసు కానీ వాటిని డబుల్, ట్రిపుల్ సెంచరీలుగా ఎలా మలచాలో తెలియదు అని 1983 ప్రపంచకప్ విజేత కెప్టెన్ అన్నారు. సచిన్ తన కెరీర్‌లో ఎక్కువ డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు సాధించాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. పరుగులకు సంబంధించి సచిన్‌ ఖాతాలో అనేక అంతర్జాతీయ రికార్డులు ఉన్నాయని, అయితే టెస్టు క్రికెట్‌ విషయానికొస్తే డబుల్‌ సెంచరీల రికార్డులో సచిన్‌ టాప్‌ పదిలో కనిపించడన్నారు.

డబుల్‌ సెంచరీలు చేయడం తెలీదు

డబుల్‌ సెంచరీలు చేయడం తెలీదు

తాజాగా మహిళ క్రికెట్‌ జట్టు కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్‌ దేవ్‌ మాట్లాడుతూ... 'సచిన్ టెండూల్కర్ చాలా ప్రతిభావంతుడు. క్రికెట్‌ చరిత్రలో అలాంటి వ్యక్తిని చూడలేదు. సెంచరీలు ఎలా చేయాలో సచిన్‌కు బాగా తెలుసు. కానీ ఆ సెంచరీలను డబుల్, ట్రిపుల్ శతకాలుగా ఎలా మలచాలో తెలియదు. సెంచరీ చేసిన తరువాత సచిన్ ఎక్కువగా సింగిల్స్ తీసుకునేవాడు. ఎక్కువ స్పీడ్‌గా ఆడేవాడు కాదు. అతను ఎప్పుడూ క్రూరమైన బ్యాట్స్‌మన్‌ కాలేడు' అని అన్నారు. అంతర్జాతీయ కెరీర్‌లో కపిల్ 131 టెస్టుల్లో, 225 వన్డే మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.

కనీసం 5 ట్రిపుల్‌ సెంచరీలు చేయాల్సింది

కనీసం 5 ట్రిపుల్‌ సెంచరీలు చేయాల్సింది

'సచిన్ టెండూల్కర్‌ కనీసం అయిదు ట్రిపుల్‌ సెంచరీలు, పది డబుల్‌ సెంచరీలు చేయాల్సి ఉండేది. ఎందుకంటే.. అతను ప్రతి ఓవర్లో బౌండరీ బాదేవాడు. టెస్ట్‌ క్రికెట్‌లో 51 సెంచరీలు సాధించిన సచిన్‌కు.. తన మొదటి డబుల్ సెంచరీ సాధించడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఇది 1999లో న్యూజిలాండ్‌తో ఆడిన మ్యాచ్‌లో సాధ్యమైంది. వాస్తవానికి సచిన్ 51 సెంచరీలలో కేవలం 20 మాత్రమే 150కి పైగా స్కోర్లుగా ఉన్నాయి. అయితే 2010లో దక్షిణాఫ్రికాపై వన్డే డబుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్‌మెన్ సచిన్' అని భారత మాజీ సారథి కపిల్ పేర్కొన్నారు.

కేవలం ఆరు డబుల్‌ సెంచరీలు

కేవలం ఆరు డబుల్‌ సెంచరీలు

సచిన్ టెండూల్కర్‌‌ ఖాతాలో అనేక అంతర్జాతీయ రికార్డులు ఉన్నాయి. అయితే టెస్టు క్రికెట్‌ విషయానికొస్తే డబుల్‌ సెంచరీల రికార్డులో సచిన్‌ టాప్‌ పదిలో కనిపించడు. మార్వన్ అటపట్టు, వీరేంద్ర సెహ్వాగ్, జావేద్ మియాందాద్, యూనిస్ ఖాన్, రికీ పాంటింగ్ లాగే సచిన్ కూడా టెస్ట్ క్రికెట్‌లో ఆరు డబుల్ సెంచరీలు కలిగి ఉన్నాడు. కాని డబుల్‌ సెంచరీల రికార్డులో సచిన్‌ 12వ స్థానంలో ఉన్నాడు. 200 టెస్టు మ్యాచుల్లో సచిన్‌ కేవలం ఆరు డబుల్‌ సెంచరీలు మాత్రమే చేశాడు.

కెరీర్‌ మొత్తంలో 34,357 పరుగులు

కెరీర్‌ మొత్తంలో 34,357 పరుగులు

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకానన్ని పరుగులతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో నిలిచాడు. లిటిల్ మాస్టర్ తన కెరీర్‌ మొత్తంలో 34,357 పరుగులు చేశాడు. టెస్టుల్లో 15,921.. వన్డేల్లో 18426, టీ20ల్లో 10 రన్స్ బాదాడు. వన్డేల్లో తొలి ద్విశతకం బాదిన క్రికెటర్‌గా సచిన్ చరిత్ర సృష్టించాడు. 2010 ఫిబ్రవరి 24న గ్వాలియర్‌లో దక్షిణాఫ్రికాపై 147 బంతుల్లో 200 పరుగులు పూర్తిచేశాడు. 2012 మార్చి 16న శతకం బాది.. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో వంద శతకాలు బాదిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచకప్‌ ఆడిన క్రికెటర్‌గా కూడా సచిన్ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టెస్టుల్లో 200 మ్యాచ్‌లు ఆడిన ఒకేఒక్క ఆటగాడు మాస్టర్‌ బ్లాస్టర్ కావడం విశేషం. 2012 డిసెంబర్‌లో వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన సచిన్.. 2013 అక్టోబర్‌లో టీ20లకు, 2013 నవంబర్‌ 13న అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

IPL 2020: ఐపీఎల్ 2020‌కి అభిమానులను అనుమతించండి: నెస్ వాడియా

Story first published: Wednesday, July 29, 2020, 14:55 [IST]
Other articles published on Jul 29, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+