For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కపిల్‌దేవ్‌ సంచలన నిర్ణయం.. సీఏసీ పదవికి రాజీనామా!!

Kapil Dev resigns as BCCI Cricket Advisory Committee chief over Conflict of Interest notices

న్యూఢిల్లీ: ప్రపంచకప్ విజేత, భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐ క్రికెట్‌ సలహా మండలి (సీఏసీ) నుండి కపిల్‌దేవ్‌ తప్పుకున్నారు. ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్‌ సలహా మండలి నుంచి శాంత రంగస్వామి ఇప్పటికే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బుధవారం కపిల్‌దేవ్‌ సీఏసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. అయితే కపిల్ తన రాజీనామాకు గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. సుప్రీంకోర్టు నియమించిన అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ (సీఓఏ)కి కపిల్‌దేవ్‌ ఒక ఇమెయిల్ రాసి.. తన నిర్ణయం గురించి వివరించారు.

జులైలో సీఏసీ నియామకం:

జులైలో సీఏసీ నియామకం:

గత జులై నెలలో బీసీసీఐ ముగ్గురు సభ్యులతో కూడిన క్రికెట్‌ సలహా మండలిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కపిల్‌దేవ్‌, శాంత రంగస్వామి, అన్షుమాన్ గైక్వాడ్‌ సభ్యులు. ఈ కమిటీ ఇటీవలే టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రిని ఎంపిక చేసింది. అంతకుముందు భారత మహిళల జట్టుకు కోచ్‌ను కూడా ఎంపిక చేసింది.

సీఏసీకి నోటీసులు:

సీఏసీకి నోటీసులు:

కపిల్‌దేవ్‌ వ్యాఖ్యాతగా, ఫ్లడ్‌లైట్ల సంస్థ అధిపతిగా, భారత క్రికెటర్ల సంఘం సభ్యుడి (ఐసీఏ)గా ఉన్నారు. గైక్వాడ్‌ సొంత అకాడమీతో పాటు బీసీసీఐ అఫిలియేషన్‌ కమిటీలో సభ్యులు. శాంత కూడా ఐసీఏ సభ్యురాలు. అందరూ పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తారని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం సభ్యుడు సంజీవ్‌ గుప్తా బీసీసీఐ నైతిక విలువల అధికారి జస్టిస్‌ డీకే జైన్‌కు ఫిర్యాదు చేసాడు. ఈ నేపథ్యంలో డీకే జైన్‌ అక్టోబర్‌ 10లోగా వివరణ ఇవ్వాలని సీఏసీకి నోటీసులు పంపారు.

కపిల్‌దేవ్‌ రాజీనామా:

కపిల్‌దేవ్‌ రాజీనామా:

ఇప్పటికే నోటీసులు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శాంత రంగస్వామి సీఏసీ నుంచి తప్పుకున్నారు. తాజాగా సీఏసీ నుంచి కపిల్‌దేవ్‌ కూడా తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. పరస్పర విరుద్ద ప్రయోజనాల అంశంపై నోటీసుల రావడంతో కపిల్‌దేవ్‌ ఆగ్రహంగా ఉన్నారు అని ఆయన సన్నిహిత వర్గాల నుండి సమాచారం తెలుస్తోంది. అంతేకాకుండా దీనిపై ఎవరికి సమాధానం చెప్పే ఇష్టం లేకనే తప్పుకుంటున్నట్లు సమాచారం.

 భగవంతుడే భారత క్రికెట్‌ను కాపాడాలి:

భగవంతుడే భారత క్రికెట్‌ను కాపాడాలి:

కపిల్‌దేవ్‌ తప్పుకోవడంతో పరస్పర విరుద్ద ప్రయోజనాల అంశం మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో మాజీ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్‌ ద్రవిడ్‌లకు కూడా నోటీసులు అందిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ అంశంపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. 'విరుద్ద ప్రయోజనాల కింద నోటీసులు ఇవ్వడం భారత క్రికెట్‌లో ఇదో కొత్త ఫ్యాషన్‌ అయింది. భగవంతుడే భారత క్రికెట్‌ను కాపాడాలి; అంటూ సౌరవ్‌ గంగూలీ విమర్శించాడు.

Story first published: Wednesday, October 2, 2019, 13:40 [IST]
Other articles published on Oct 2, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+