Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతను ఔట్ అయితే భారత్ ఓడినట్లే!- కపిల్ దేవ్

దిగ్గజ క్రికెటర్, 1983 ప్రపంచకప్ విజేత సునీల్ గవాస్కర్ ఇవాళ తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో గవాస్కర్ తనకంటూ ప్రత్యేక పేజీలు లిఖించుకున్నాడు. 223 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 13214 పరుగులు చేశాడు. టెస్టుల్లో పది వేల పరుగుల మార్క్‌ అందుకున్న తొలి బ్యాటర్‌గా చరిత్రలో నిలిచాడు.

అయితే గవాస్కర్ 75వ జన్మదిన సందర్భంగా.. 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ కపిల్ దేవ్ మాట్లాడాడు. గవాస్కర్‌ను కొనియాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. భారత్ తరఫున వాళ్లు బరిలోకి దిగిన సమయంలో అప్పటి పరిస్థితుల గురించి, ప్రత్యర్థి ఆలోచనల గురించి కపిల్ దేవ్ తెలిపాడు.

Kapil Dev on Sunil Gavaskar s 75th Birthday Get Gavaskar and You Can Get the Team

''నువ్వు ఆడింది 20 ఏళ్లు.. క్రికెట్ గురించి మాట్లాడేది 40 ఏళ్లు అని గవాస్కర్‌తో సరదాగా అంటుంటాను. ఇది ఆటపై అతనికి ఉన్న జ్ఞానం, ప్రేమ గురించి తెలియజేస్తుంది. యువ క్రికెటర్లు ఇప్పటికీ అతని నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొంటూ భారీ పరుగులు సాధించాలంటే ప్రత్యేకమైన నైపుణ్యం ఉండాలి. అతను సాధించాడు. ఆ స్థితిలో టీమిండియా ప్రణాళికలు రచించడానికి వనరులు లేవంటే మీరు నమ్మలేరు''

''అయితే గవాస్కర్ ఓ మార్గాన్ని కనుగొన్నాడు. అది సాధించిన పరుగులు అంకెల కంటే ఎక్కువ విలువైనది. నా సీనియర్ అయిన అతనితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం గొప్ప అనుభూతిగా ఫీల్ అయ్యాను. విల్స్ ట్రోఫీలో అతను నాకిచ్చిన మొదటి సలహా ఇప్పటికీ గుర్తు ఉంది. ఆ మ్యాచ్‌లో మేం ప్రత్యర్థులుగా బరిలోకి దిగినప్పటికీ బౌలింగ్‌లో టిప్స్ ఇచ్చాడు. ఇక అతని గొప్పతనం గురించి చెప్పాలంటే ప్రత్యర్థి జట్టు అతని కోసం ప్రత్యేక ప్రణాళికలు రచించేది''

''గవాస్కర్‌ను ఔట్ చేయడానికి 90 శాతం తమ సమయాన్ని ప్రణాళికలు సిద్ధం చేయడానికే వాడతారు. గవాస్కర్‌ను ఔట్ చేస్తే జట్టును ఆలౌట్ చేయొచ్చు అని ప్రత్యర్థి జట్టు ఆలోచిస్తుంటుంది. అంతలా ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకువచ్చేలా అతను సత్తాచాటాడు. హేమాహేమీలపై ఎలా పైచేయి సాధించాలో ఈ లిటిల్ మాస్టర్‌కు బాగా తెలుసు'' అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.

Story first published: Wednesday, July 10, 2024, 13:46 [IST]
Other articles published on Jul 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+