ఈడెన్‌లో యాడ్ షూటింగ్: కపిల్ బౌలింగ్...ధోని బ్యాటింగ్!
హైదరాబాద్: భారత క్రికెట్‌లో వారిద్దరికి ప్రత్యేక స్ధానం ఉంది. కెప్టెన్లుగా భారత్‌కు వరల్డ్ కప్‌లను అందించారు. వేర్వేరు తరాలకు చెందిన వారు కావడంతో వారిద్దరూ కలిసి ఆడే అవకాశం ఎప్పుడూ రాలేదు. అయితే ఓ యాడ్ షూటింగ్ కోసం వారిద్దరూ ఇప్పుడు జత కట్టారు.
ఆ ఇద్దరూ ఎవరో కాదు... కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని. గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో క్రికెట్ దిగ్గజం పిల్ దేవ్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒక వ్యాపార ప్రకటన నిమిత్తం సందడి చేశారు. షూటింగ్‌లో భాగంగా కపిల్ బౌలింగ్ చేయగా, ధోని బ్యాటింగ్ చేశాడు.

కపిల్‌కు బౌలింగ్ చేసిన ధోని
ఆ తర్వాత ధోని కూడా కపిల్ దేవ్‌కు బౌలింగ్ చేయడం విశేషం. ఈ యాడ్ షూటింగ్‌ని చూసేందుకు పెద్ద ఎత్తున చిన్నారులు ఈడెన్ గార్డెన్స్‌కు తరలివచ్చారు. 30 నిమిషాల నిడివి కలిగిన ఈ యాడ్ షూటింగ్‌లో కపిల్ దేవ్, ధోనిలతో పాటు చిన్నారులు కూడా కలిసి నటించారు.

ధోని సహజ నటుడు
‘షూటింగ్ సమయంలో తాను బౌలింగ్ చేయలేనని, అలసిపోతానని ముందుగా చెప్పినా ఒక్కసారి మైదానంలోకి దిగిన తర్వాత కపిల్ ఆగలేదు. పెద్ద సంఖ్యలో బంతులు విసరడంతో పాటు బ్యాటింగ్‌లో కూడా షాట్లు కొట్టారు. ఇక ధోని అయితే సహజ నటుడు. ఒక్కసారి కూడా నేను రీటేక్ చేయాల్సిన అవసరమే రాలేదు' అని ఈ యాడ్‌ని రూపొందించన అరిందమ్ సిల్ వెల్లడించారు.

ధోని, కపిల్‌తో సౌరవ్ గంగూలీ
ఈ షూటింగ్‌కు ముందు ధోని త్వరలో భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగే తొలి టెస్టు కోసం మైదానంలో జరుగుతన్న సన్నాహకాలను పరిశీలించాడు. అంతేకాదు మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న యువ క్రికెటర్లకు ధోని సలహాలు కూడా ఇచ్చాడు. ఇదిలా ఉంటే మరో మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ షూటింగ్‌కు ముందు వీరిద్దరితో కలిసి మాట్లాడాడు.

నవంబర్ 16 నుంచి శ్రీలంకతో తొలి టెస్టు
కాగా, భారత్-శ్రీలంక జట్ల మధ్య నవంబర్ 16 నుంచి కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం శ్రీలంక ఇప్పటికే భారత్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. గురువారం నుంచి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications