Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేటీఆర్‌ను కలిసిన కపిల్‌దేవ్‌.. గోల్ఫ్‌కు సహకారం అందించాలని విజ్ఞప్తి!!

Kapil Dev Meets KTR In Hyderabad || Oneindia Telugu
Kapil Dev Meets KTR In Hyderabad

హైదరాబాద్‌: తెలంగాణ మునిసిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో భారత మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌ సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. డ్రీమ్‌ వ్యాలీకి ప్రచారకర్తగా ఉన్న కపిల్‌ తెలంగాణలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న గోల్ఫ్‌ కౌంటీల అభివృద్ధి విషయమై కేటీఆర్‌తో మాట్లాడారు. చేవేళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసిఉద్దీన్‌ తదితరులు కపిల్‌దేవ్‌తో మాట్లాడారు.

ఈ సందర్భంగా వికారాబాద్‌, తూప్రాన్‌లో అభివృద్ధి చేస్తున్న అంతర్జాతీయ స్థాయి గోల్ఫ్‌ కౌంటీలకు ప్రభుత్వం నుంచి సహకారం అందించాల్సిందిగా కేటీఆర్‌ను కపిల్‌దేవ్‌ కోరారు. అలాగే వచ్చే ఏడాది పూర్తి కానున్న వికారాబాద్‌లోని గోల్ఫ్‌ కౌంటీ ప్రారంభోత్సవానికి విచ్చేయాల్సిందిగా కేటీఆర్‌ను కపిల్‌ ఆహ్వనించారు.

Kapil Dev Meets KTR In Hyderabad

అనంతరం పరిగి ఎమ్మెల్యే మహేశ్‌ రెడ్డితో కలిసి వికారాబాద్‌ జిల్లా పూడూరు మండల పరిధిలోని మన్నెగూడ సమీపంలో సుమారు 100 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న గోల్ఫ్‌ కౌంటీ నిర్మాణ పనులను కపిల్‌దేవ్‌ పరిశీలించారు. వచ్చే సంవత్సరం మార్చిలో మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నట్లు కౌంటీ ప్రతినిధులు తెలిపారు.

ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ... 'కపిల్‌దేవ్‌ ఓ లెజెండ్. అతన్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది. గోల్ఫ్‌ కౌంటీ ఏర్పాటుతో పరిగి నియోజకవర్గానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. నిర్మాణం పూర్తి అయితే యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి' అని తెలిపారు. ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, డ్రీమ్‌ వ్యాలీ చైర్మన్‌ సంతోష్‌ రెడ్డి కపిల్‌తో ఉన్నారు.

Story first published: Tuesday, November 26, 2019, 8:42 [IST]
Other articles published on Nov 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+