ఇగోను వ‌దిలేయ్‌.. విరాట్ కోహ్లీపై క‌పిల్ దేవ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

ఇటీవ‌ల టీమిండియా కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న విరాట్ కోహ్లీపై టీమిండియా మాజీ కెప్టెన్ క‌పిల్ దేవ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోవాల‌నే విరాట్ కోహ్లీ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించిన ఆయ‌న‌.. త‌న ఇగోను ప‌క్క‌న పెట్టి జూనియ‌ర్ల కెప్టెన్సీలో ఆడాల‌ని సూచించారు. అంతేకాకుండా కెప్టెన్సీ కోహ్లీకి భారంగా అనిపించింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

గ‌డ్డు కాలాన్ని గ‌డుపుతున్నాడు

గ‌డ్డు కాలాన్ని గ‌డుపుతున్నాడు

"టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొల‌గాల‌న్న విరాట్ కోహ్లీ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నాను. టీ20 కెప్టెన్సీ వ‌దులుకున్న‌ప్ప‌టి నుంచి కోహ్లీ గ‌డ్డు కాలాన్ని గ‌డుపుతున్నాడు. తీవ్ర ఒత్తిడిలో క‌నిపిస్తున్నాడు. కాబ‌ట్టి బ్యాట‌ర్‌గా స్వేచ్ఛగా ఆడ‌డానికి విరాట్ కోహ్లీ త‌న కెప్టెన్సీని వ‌దులుకున్నాడు. విరాట్ కోహ్లీ ప‌రిణ‌తి చెందిన ఆట‌గాడు. కెప్టెన్సీ వ‌దులుకునే నిర్ణ‌యం తీసుకునే ముందు కోహ్లీ బాగా ఆలోచించి ఉంటాడ‌ని నేను క‌చ్చితంగా అనుకుంటున్నాను." అని క‌పిల్ దేవ్ పేర్కొన్నారు.

ఇగోను వ‌దిలేయ్‌

ఇగోను వ‌దిలేయ్‌

విరాట్ కోహ్లీ కెప్టెన్సీని ఆస్వాదించ‌లేక‌పోయి ఉంటాడ‌ని క‌పిల్ దేవ్ అభిప్రాయ‌ప‌డ్డారు. అందుకే కెప్టెన్సీని భారంగా భావించి త‌ప్పుకోని ఉంటాడ‌ని తెలిపారు. అయితే ఇంత‌కాలం భారత జ‌ట్టుకు సేవ చేసినందుకు కోహ్లీకి ఆయ‌న ద‌న్య‌వాదాలు తెలిపారు. అంతేకాకుండా 33 ఏళ్ల విరాట్ కోహ్లీ ప్ర‌స్తుతం ఇగోను వ‌దిలేసి, జూనియ‌ర్ల కెప్టెన్సీలో ఆడాల‌ని క‌పిల్ దేవ్ సూచించారు. ఈ సంద‌ర్భంగా తాను క్రికెట్ ఆడిన రోజుల‌ను గుర్తు చేసుకున్న క‌పిల్ దేవ్‌.. తాను కూడా త‌న జూనియ‌ర్ల కెప్టెన్సీలో ఆడాన‌ని చెప్పారు.

జూనియ‌ర్ల కెప్టెన్సీలో ఆడాను

జూనియ‌ర్ల కెప్టెన్సీలో ఆడాను

క్రిష్ణమాచారి శ్రీకాంత్‌, మహ్మద్‌ అజారుద్దీన్ వంటి త‌న జూనియ‌ర్ల కెప్టెన్సీలో తాను ఆడిన‌ట్లు క‌పిల్ దేవ్ గుర్తు చేసుకున్నారు. త‌న‌కు ఎటువంటి ఇగో లేద‌ని చెప్పారు. సునీల్ గ‌వాస్క‌ర్ కూడా త‌న కెప్టెన్సీలో ఆడిన‌ట్లు క‌పిల్ దేవ్ తెలిపారు. విరాట్ కోహ్లీ కూడా త‌న ఇగోను ప‌క్క‌న పెట్టి జూనియ‌ర్ల కెప్టెన్సీలో ఆడాల‌ని సూచించారు.

ఇది విరాట్ కోహ్లీకి, భార‌త క్రికెట్‌కు మంచి చేస్తుంద‌ని అన్నారు. జ‌ట్టులోని కొత్త ఆట‌గాళ్ల‌తోపాటు కొత్త కెప్టెన్‌కు విరాట్ మార్గ నిర్దేశం చేయాల‌ని సూచించారు. విరాట్ కోహ్లీ సేవ‌ల‌ను భార‌త జ‌ట్టు కోల్పోలేద‌ని అందుకే అత‌ను జ‌ట్టులో ఆడాల‌ని క‌పిల్ దేవ్ సూచించారు.

కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న కోహ్లీ

కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న కోహ్లీ

కాగా టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ స‌మ‌యంలో టీ20 కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న విరాట్ కోహ్లీని వ‌న్డే కెప్టెన్సీ కూడా బీసీసీఐ తొల‌గించింది. తాజాగా టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా త‌ప్పుకోవ‌డంతో టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ శ‌కం ముగిసింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, January 17, 2022, 13:57 [IST]
Other articles published on Jan 17, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X