Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎరుపు రంగు టీ షర్ట్‌‌లో కపిల్ దేవ్: అవాక్కైన ప్యాన్స్, ట్విట్టర్‌లో జోకులు

‘Kapil Dev in Ranveer Singh biopic?’ Twitter’s making the same joke about this viral pic

హైదరాబాద్: బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ బయోపిక్‌లో మాజీ ఆల్‌ రౌండర్‌ కపిల్‌దేవ్‌ నటిస్తున్నాడా? అంటే అవుననే అంటున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు. తాజాగా బోథమ్‌ చారిటి కార్యక్రమానికి వెళ్లిన కపిల్‌ దేవ్ వేషం చూసిన వాళ్లంతా ఇదే మాట అంటున్నారు. కపిల్ ఎరుపు రంగు టీ షర్ట్‌.. నీలం, తెలుపు, ఎరుపు రంగుల గీతలతో ఉన్న పాయింట్ ధరించి హాజరైయ్యాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ విచిత్రమైన డ్రెస్‌ను చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కపిల్‌ దేవ్ ఫొటోను నటుడు షరీబ్‌ హష్మి, క్రికెట్‌ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ట్విటర్‌లో షేర్‌ చేయడంతో నెటిజన్లు జోకులు మీద జోకులు వేస్తున్నారు. రణ్‌వీర్‌ బయోపిక్‌లో నటించేందుకు కపిల్‌ సిద్దమయ్యారా? అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

కపిల్‌, రణ్‌వీర్‌ ఒకరికొకరు పరస్పరం తమ పాత్రల్లో నటించనున్నారంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. నిజానికి రణవీర్ సింగ్ చిత్రవిచిత్రమైన డ్రస్సులు ధరిస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. అలాంటిది ఇప్పుడు కపిల్ దేవ్ కూడా గతానికి భిన్నంగా కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు.

కపిల్ నాయకత్వంలోని టీమిండియా 1983లో ప్రపంచకప్‌ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా తొలి ప్రపంచకప్ గెలిచిన మధుర క్షణాలను '1983' టైటిల్‌తో బాలీవుడ్‌ దర్శకుడు కబీర్‌ఖాన్‌ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో కపిల్‌దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌సింగ్‌ నటిస్తున్నారు. జులై 6న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలని చూస్తున్నారు.

Story first published: Monday, July 8, 2019, 18:18 [IST]
Other articles published on Jul 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+