
హైదరాబాద్: 1983 ప్రపంచ కప్‌ను భారత్‌కు అందించిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆల్ రౌండర్ పాండ్యాను తెగ మెచ్చుకుంటున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో పాండ్యా అద్వితీయమైన ప్రదర్శన చేసి 93 పరుగులు సాధించాడు. అంత ఒత్తిడిలో ఆఖరి వరకు వికెట్ కాపాడుకుంటూ అన్ని పరుగులను మంచి నేర్పుతో సాధించాడని ప్రశంసిస్తున్నాడు.
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా దక్షిణాఫ్రికా తొలి టెస్టులో పాల్గొంది. కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 0-1తేడాతో ఓడిపోయింది. 72 పరుగుల తేడాతో ఓడిపోయిన భారత్ జట్టుకు సూచనలందిస్తున్న క్రమంలో కపిల్ దేవ్ పాండ్యా ప్రతిభను కపిల్ దేవ్ అభినందిస్తున్నాడు.
'పాండ్యా మీద ఒత్తిడి తేవద్దు. ఓ క్రికెటర్‌ని వేరొకరితో పోల్చడం సరికాదు. ఎవరి శైలి వారిది. పాండ్యా బౌలింగ్, బ్యాటింగ్‌లలో చక్కగా రాణిస్తున్నాడు. ఇలాంటి ఆటగాళ్లను కట్టడి చేసి ఒత్తిడికి గురి చేయడం సరికాదు. యువ ఆటగాళ్లు చక్కగా ఆడుతున్నారు.' అని అభిప్రాయపడ్డాడు.
పాండ్యా బ్యాటింగ్‌లోనే గాక సెకండ్ ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌లోనూ రెండు వికెట్లు తీసి ఇరగదీశాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.