For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కపిల్ దేవ్ న్యూలుక్.. గుండు చేసుకున్నాడు కానీ..!!

Kapil Dev has shaved his head for a new look during lockdown

ముంబై: కరోనా వైరస్ మహమ్మారి పంజా విసరడంతో భారత కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ తమ ఇళ్లకే పరిమితమవుతున్నారు. దొరికిన ఈ ఖాళీ సమయంలో కొందరు ఇంటి పనులతో బిజీగా ఉంటే.. మరికొందరు తమ చిన్ననాటి జ్ఞాపకాలను ఫోటోల రూపంలో షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇంకొందరు కొన్ని వినూత్నమైన ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ తన లుక్ మార్చుకున్నారు.

లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో క్రికెట్‌ దిగ్గజం కపిల్ దేవ్‌ స్వయంగా హెయిర్‌ కట్‌ చేసుకున్నారు. అయితే పూర్తిగా గుండు చేసుకొని.. ఫ్రెంచ్ కట్ షేవింగ్‌తో కొత్త లుక్‌లో దర్శమిచ్చారు. కొత్త లుక్‌లో ఉన్న తన ఫొటోలను కపిల్ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కొంత సమయంలోనే ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. కపిల్ ఈ కొత్త లుక్‌లో సూపర్‌గా ఉన్నారంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కొందరు సినిమా హీరో అంటూ పొగుడ్తల వర్షం కురిపిస్తున్నారు.

తన మాజీ సహచరుడు మరియు స్నేహితుడు చేతన్ శర్మ కూడా కపిల్ దేవ్‌ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇందులో కపిల్ దేవ్ బ్లాక్ సూట్ ధరించి తన కొత్త రూపంలో కనిపిస్తున్నారు. 'లెజెండరీ కపిల్ దేవ్ యొక్క కొత్త రూపం అద్భుతమైనది అని చేతన్ శర్మ అన్నారు. పాజీని విభిన్న రూపంలో చూడటం చాలా బాగుందన్నారు. కపిల్‌ దేవ్‌ జీవితాధారంగా బాలీవుడ్‌లో బయోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమాకు '83' అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. 1983లో కపిల్‌ దేవ్‌ సారథ్యంలో భారత జట్టు ప్రపంచకప్ ఎలా గెలిచింది అన్న నేపథ్యంలో సినిమాను కబీర్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్నారు.

కొద్ది రోజుల టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 'ట్రిమ్ ఎట్ హోం' అనే ఛాలెంజ్‌ను స్వీకరించిన తన ఇంటిలోనే షేవింగ్ చేసుకొన్న వీడియోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా తనకు తానే హెయిర్‌కట్ చేసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 'స్క్వేర్‌కట్లు ఆడడం నుంచి.. నాకు నేను హెయిర్‌కట్‌ చేసుకోవడం వరకు. విభిన్నమైన పనులను చేయడాన్ని ఎప్పుడూ ఎంజాయ్‌ చేస్తా. నా కొత్త స్టెల్‌ చూసేందుకు ఎలా ఉంది' అని సచిన్‌ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, April 21, 2020, 20:00 [IST]
Other articles published on Apr 21, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+