40 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున: కపిల్ దేవ్ కెరీర్‌లో టాప్-5 మూమెంట్స్

హైదరాబాద్: సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే రోజున భారత క్రికెట్‌లోకి ఓ క్రికెట్ దిగ్గజం అరంగేట్రం చేశాడు. ఇంతకీ ఆ క్రికెట్ దిగ్గజం ఎవరని అనుకుంటున్నారా? కపిల్ దేవ్. అక్టోబర్ 16, 1978న ఫైసలాబాద్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కపిల్ దేవ్ అరంగేట్రం చేశాడు.
స్వదేశంతో పాటు విదేశాల్లో కూడా కపిల్ దేవ్ అనేక రికార్డులను తన పేరిట లిఖించాడు. బీసీసీఐ భారత్ క్రికెట్‌కు అందించిన అత్యుత్తమ ఆల్ రౌండర్లలో కపిల్ దేవ్ ఒకడు. భారత్ తరుపున మొత్తం 131 టెస్టు మ్యాచ్‌లాడిన కపిల్ దేవ్ 434 వికెట్లు తీయడంతో పాటు 5248 పరుగులు చేశాడు.
ఇందులో 8 సెంచరీలు ఉన్నాయి. ఇక భారత్ తరుపున 225 వన్డేలాడిన కపిల్ దేవ్ 253 వికెట్లు తీయడంతో పాటు 3783 పరుగులు చేశాడు. వన్డేల్లో ఒక సెంచరీతో పాటు 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అభిమానులు ముద్దుగా 'హర్యానా హరికేన్' గా పిలుచుకునే కపిల్ దేవ్ కెరీర్‌లో టాప్-5 బెస్ట్ మూమెంట్స్ మీకోసం...

కపిల్ దేవ్ అరంగేట్రం
అప్పటివరకు భారత పేసర్లను పార్ట్ టైమ్ బౌలర్లుగా గుర్తించేవారు. వీరు చేసే పనేంటంటే కొత్త బంతి మెరుగును పూర్తిగా తీసేసి స్పిన్నర్లకు అందజేయడం. అయితే, ఎప్పుడైతే కపిల్ దేవ్ జట్టులోకి వచ్చాడో భారత క్రికెట్ చరిత్రనే మార్చివేసింది. పాస్ట్ బౌలర్లు సైతం వికెట్లు తీయగలరని నిరూపించాడు. ప్రస్తుతం భారత జట్టులో అద్భుతమైన పేసర్లు ఉన్నారంటే అందుకు కారణం 40 ఏళ్ల క్రితం కపిల్ దేవ్ అరంగేట్రం చేయడమే.

1983 వరల్డ్ కప్
1983 వరల్డ్ కప్ భారత్ క్రికెట్ చరిత్రను పూర్తిగా మార్చివేసింది. అండర్ డాగ్స్‌గా కపిల్ దేవ్ నాయకత్వంలోని టీమిండియా ఈ టోర్నీ బరిలోకి దిగింది. అయితే, లార్డ్స్ వేదికగా జరిగిన పైనల్లో వెస్టిండిస్ జట్టుపై 43 పరుగుల తేడాతో విజయం సాధించి వరల్డ్ కప్‌ను అందుకోవడం ప్రతి క్రికెట్ అభిమాని కళ్ల ముందు ఇప్పటికీ కదిలాడుతూనే ఉంటుంది. మదన్ లాల్ బౌలింగ్‌లో వెస్టిండిస్ డేంజరస్ బ్యాట్స్ మన్ వివ్ రిచర్డ్స్ ఇచ్చిన క్యాచ్‌ని పరిగెత్తుకుంటూ వెళ్లి కపిల్ దేవ్ అందుకున్న క్యాచ్ మ్యాచ్‌కే హైలేట్. ఈ మూమెంట్ భారత క్రికెట్ చరిత్రను పూర్తిగా మార్చింది.

మొదట 17/5... ఆ తర్వాత 175
టన్‌బ్రిడ్జి వెల్స్ వేదికగా జింబాబ్వేతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో భారత్‌ను 17/5 పరుగులకే కట్టడి చేశాడు ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టులో ఆడుతున్న శామ్ కర్రన్ తండ్రి కెవిన్ కర్రన్. ఈ మ్యాచ్‌లో టీమిండియా 78/7 వద్ద ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన కపిల్ దేవ్ మదన్ లాల్, సయ్యద్ కిర్మాణిలతో కలిసి నెలకొల్పిన 175 పరుగుల(138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సులు) భాగస్వామ్యం అతడి కెరీర్లోనే బెస్ట్ మూమెంట్. కపిల్ దేవ్ విజృంభణతో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.

6, 6, 6, 6 ఫాలో ఆన్‌ను తప్పించిన కపిల్ దేవ్
లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో టీమిండియా 430/9 వద్ద ఉన్నప్పుడు ఫాలో ఆన్ నుంచి భారత్ తప్పించుకోవాడనికి టీమిండియాకు 24 పరుగులు అవసరమయ్యాయి. చివరి బ్యాట్స్ మన్ నరేంద్ర హిర్వాణితో కలిసి కపిల్ దేవ్ ఆడిన బాధ్యాయుతమైన ఇన్నింగ్స్ అతడి కెరీర్‌లోనే ఓ బెస్ట్ మూమెంట్. ఇంగ్లాండ్ బౌలర్ ఎడ్డీ హెమ్మింగ్స్ బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సులు బాది భారత జట్టుని ఫాలో ఆన్ నుంచి తప్పించాడు. ఈ టెస్టులో టీమిండియా 247 పరుగుల తేడాతో ఓడినప్పటికీ, కపిల్ ఇన్నింగ్స్ మాత్రం చరిత్రలో అలా నిలిచిపోయింది.

దక్షిణాఫ్రికా జట్టుపై 129
పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ బౌలర్లు అలెన్ డొనాల్డ్, బ్రెట్ షెల్క్జ్, బ్రియాన్ మెక్ మిలన్ విజృంభించడంతో ఆతిథ్య దక్షిమాఫ్రికాకు 63 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం భారత ఇన్నింగ్స్‌లో కపిల్ దేవ్ మనోజ్ ప్రభాకర్, కిరణ్ మోరే, అనిల్ కుంబ్లేతో కలసి 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెల కొల్పాడు. దీంతో ఆతిథ్య జట్టుకు టీమిండియా 153 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కపిల్ గనుక ఈ మాత్రం ఇన్నింగ్స్ కూడా ఆడి ఉండకపోతే భారత్ పరిస్థితి మరోలా ఉండేది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications