500వ టెస్ట్, డే 1: కోహ్లీ విఫలం, రాణించిన కివీస్ బౌలర్లు (ఫోటోస్)
కాన్పూర్:న్యూజిలాండ్‌తో కాన్పూర్‌లో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. భారత్ 9 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్లలో అత్యధికంగా మురళీ విజయ్ 65 పరుగులు చేయగా, పుజారా 62, అశ్విన్ 40, రోహిత్ శర్మ 35, కెఎల్ రాహుల్ 32, రహానే 18, కోహ్లీ 9 పరుగులు చేశారు.
ప్రస్తుతం జడేజా 16, ఉమేష్ యాదవ్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఒకానొక దశలో భారత్ స్కోరు 400 వరకూ వెళుతుందనుకున్న స్కోరు ఆ తర్వాత నెమ్మదించింది. మధ్యాహ్నం లంచ్ విరామ సమయానికి ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 150కి పైగా పరుగులు చేసిన భారత్ బ్యాట్స్ మెన్ పూర్తిగా విఫలమయ్యారు.
న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్, మిచెల్ షట్నర్ చెరో మూడు వికెట్లు తీసుకోగా, వాగ్నర్, మార్క్ గ్రెగ్, సోథి తలో వికెట్ తీసుకున్నారు. కాన్పూర్‌లో న్యూజిలాండ్ పైన 500వ టెస్ట్ ఆడుతున్న భారత్ గురువారం నాడు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి సెషన్లో రాణించిన భారత్, రెండో సెషన్లో తేలిపోయింది.
- పుజారా 62 పరుగులతో రాణించగా కెప్టెన్ కోహ్లి కేవలం 9 పరుగులకే పెవిలియన్ చేరిపోయాడు. మొదటి సెషన్‌లో 31 ఓవర్లు వేసిన న్యూజిలాండ్ ముగ్గురు స్పిన్నర్లతోనే 21 ఓవర్లు బౌలింగ్ వేయించడం విశేషం. టీ విరామ సమయానికి క్రీజులో రహానె, రోహిత్ క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో శాంట్నర్ రెండు, సోధీ, వాంగ్నర్ తలో వికెట్ తీశారు. భారత్ తొలి సెషన్లో రాణించింది. రెండో సెషన్లో చేతులెత్తేసింది.
- టీ విరామ సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(32), మురళీ విజయ్(65) భారత్‌కు శుభారంభాన్ని అందించారు. లంచ్ సమయానికి ఒక వికెట్ నష్టపోయి 105 పరుగులతో నిలిచిన భారత్ అనంతరం 31 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది.
- స్పిన్నర్ శాంట్నర్ వేసిన 11వ ఓవర్‌లో నాలుగో బంతిని చూడచక్కని షాట్‌తో సిక్స్‌గా మలచిన రాహుల్ చివరి బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. దీంతో అవుటయ్యాడు. బంతి బ్యాట్ అంచున తాకుతూ వెళ్లి కీపర్ వాట్లింగ్ చేతిలో పడింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది.
- తొలి టెస్టులో మొదట బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఆరంభంలోనే తొలి వికెట్ కోల్పోయింది. మొదటి నుంచి దూకుడుగా ఆడిన యువ ఓపెనర్ కేఎల్ రాహుల్ (32) బంతిని ప్లిక్ చేసే ప్రయత్నంలో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి ఓవర్ వేసిన న్యూజిలాండ్ పేస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌కి రెండు బౌండరీలతో స్వాగతం పలికిన రాహుల్ ఆరో ఓవర్‌లో మరోసారి బౌల్ట్‌కి షాకిచ్చాడు.
ఇదీ పిచ్ పరిస్థితి
84 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రలో 500వ ప్రతిష్ఠాత్మక టెస్టుకు ఆతిథ్యమివ్వనున్న సమయంలో పిచ్ కీలక పాత్ర పోషించనుంది. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ మైదానం అద్భుత ఘట్టానికి ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తోంది. పేరుకి మాత్రమే ఈ మైదానం గ్రీన్ పార్క్ కానీ పిచ్ పై ఎలాంటి పచ్చిక కనిపించదు.
ఈ వేదికపై ఆడడం ఎలాంటి వారికైనా సవాల్. పిచ్ పైన పచ్చిక లేకపోవడానికి తోడు పగుళ్లు ఇక్కడ స్పిన్నర్లు రాణించేందుకు అవకాశం కల్పిస్తుంది. స్పిన్ ద్వయం అశ్విన్, జడెజాలు మంచి ఫాంలో ఉన్నారు. తోడుగా పేసర్లు భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్‌లు ఉన్నారు.
ఈ నేపథ్యంలో భారత జట్టుకు అనుకూలంగా ఉండే పిచ్‌ను గ్రౌండ్స్ మన్ తయారు చేశారు. 500వ టెస్టులో భారత్ గెలిచి చరిత్రలో నిలిచేలా చేయాలని జట్టు ఉవ్వీళ్లూరుతోంది. కాగా, న్యూజిలాండ్ కూడా స్పిన్ మంత్రంతోనే బరిలోకి దిగుతోంది.
హాజరైన సచిన్, గంగూలీ, ధోనీ
భారత్ 500వ టెస్ట్ మ్యాచ్‌కు సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, భారత క్రికెట్ జట్టు వన్డే, టీ20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలు హాజరయ్యారు. మ్యాచ్‌ను ప్రేక్షకులతో కలిసి వీరు ఆసక్తిగా తిలకిస్తున్నారు. భారత్ 500వ మ్యాచ్ ఆడుతుండడంతో బీసీసీఐ మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. మ్యాచ్‌ను చూసేందుకు పలువురు ప్రముఖులకు బిసిసిఐ ఆహ్వానం పంపింది. క్రికెట్ మైదానం అంతా సందడిగా కనిపిస్తోంది. చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్ కావడంతో టీం ఇండియా కసిగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది.

32 పరుగులకు రాహుల్ ఔట్
కెఎల్ రాహుల్‌ను అవుట్ చేసిన తర్వాత న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంత్నర్ తన జట్టు సభ్యులతో కలిసి వేడుక చేసుకున్నాడు. కాన్పూర్ గ్రీన్ పార్కులో ప్రారంభమైన తొలి టెస్టు తొలి ఇన్నింగ్సులో భారత ఓపెనర్ కెఎల్ రాహుల్ 32 పరుగులు చేసి అవుటయ్యాడు.

సిక్స్ కొట్టాడు, అవుటయ్యాడు...
తొలి నుంచి దూకుడుగా ఆడిన యువ ఓపెనర్ కేఎల్ రాహుల్ (32: 39 బంతుల్లో 4×4, 1×6) బంతిని ప్లిక్ చేసే ప్రయత్నంలో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి ఓవర్ వేసిన న్యూజిలాండ్ పేస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌కి రెండు బౌండరీలతో స్వాగతం పలికిన రాహుల్ ఆరో ఓవర్‌లో మరోసారి బౌల్ట్‌కి షాకిచ్చాడు. అయితే స్పిన్నర్ శాంట్నర్ వేసిన 11వ ఓవర్‌లో నాలుగో బంతిని చూడచక్కని షాట్‌తో సిక్స్‌గా మలచిన రాహుల్ చివరి బంతిని అంచనా వేయడంలో విఫలమై ఔటయ్యాడు. బంతి బ్యాట్ అంచున తాకుతూ వెళ్లి కీపర్ వాట్లింగ్ చేతిలో పడింది.

సచిన్ టెండూల్కర్‌కు సత్కారం
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్‌ను భారత్ 500వ మ్యాచ్ సందర్భంగా కాన్పూర్‌లో గ్రీన్ పార్కు మైదానంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ సత్కరించారు. బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ కూడా ఉన్నారు.

రవి శాస్త్రికి సత్కారం...
భారత మాజీ కెప్టెన్ రవిశాస్త్రికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్, ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా మెమెంటో ప్రదానం చేసి సత్కరించారు. బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ కూడా ఉన్నారు.

ఎంఎస్ ధోనీకి సత్కారం
భారత్ టెస్టు క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ రామ్ నాయక్, ఐపిఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా సత్కరించారు. బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ కూడా చిత్రంలో ఉన్నారు.

విరాట్ కోహ్లీకి సత్కారం..
భారత టెస్ట్ క్రికెట్ ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీని ఉత్తర ప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ సత్కరించారు. భారత్ చారిత్రాత్మక 500వ టెస్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తున్నారు. ఈ టెస్టు మ్యాచ్ న్యూజిలాండ్‌పై జరుగుతోంది.

పుజారా ఫరవా లేదు....
న్యూజిలాండ్‌పై కాన్పూర్ గ్రీన్ పార్కు మైదానంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో గురువారంనాడు భారత బ్యాట్స్‌మన్ ఛతేశ్వర్ పుజారా ఫరవా లేదనిపించాడు. అతను 62 పరుగులు చేసి అవుటయ్యాడు.

మురళీ విజయ్ సక్సెస్...
న్యూజిలాండ్‌పై జరుగుతున్న చారిత్రాత్మక టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో మురళీ విజయ్ సక్సెస్ అయ్యాడు. అతను అర్థ సెంచరీ చేసాడు. విజయ్ 65 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications