ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌తో కలిసి టీమిండియా స్టార్ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ చిందేశారు. వీరితోపాటు అజింక్యా రహానె, రవిచంద్రన్ అశ్విన్, వరుణ్ ఆరోన్, స్టువర్ట్ బిన్నీ కూడా కాలు కదిపారు.
తాజా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించిన ఓ ప్రకటన కోసం వీళ్లందరితో ఇలా నృత్యం చేయించాడు ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాని. కంగనా రనౌత్ నటించిన'క్వీన్' చిత్రంలోని 'లండన్ ఠుమక్దా' పాట.. ఈ ప్రకటనకు నేపథ్యంగా ఉంది.
అంతేగాక, సినిమాలో పోషించిన అమాయకపు అమ్మాయి పాత్రనే.. ప్రకటనలోనూ కంగనా పోషించిందట. ఆమెతో కలిసి ధోనీ, కోహ్లి కలిసి షూటింగ్‌లో తెగ సందడి చేశారట. ఆ సందడంతా చూడాలంటే ప్రకటన విడుదలయ్యేవరకూ ఆగాల్సిందే. ఇప్పుడు మాత్రం ఈ చిత్రాలతో సరిపెట్టుకోవాల్సిందే.