
టెస్టుల్లో బెస్ట్ కెప్టెన్..
టెస్టు క్రికెట్‌లో కివీస్ జట్టు చూసిన బెస్ట్ కెప్టెన్లలో కేన్ విలియమ్సన్ ఒకడు. అతను మొత్తం 40 టెస్టుల్లో జట్టుకు సారధ్యం వహించగా.. వాటిలో 22 మ్యాచుల్లో జట్టును గెలిపించాడు. ఐసీసీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తొలి ట్రోఫీని కూడా ముద్దాడాడు. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్‌లో భారత్‌ను ఓడించిన కేన్ మామ.. తొలి డబ్ల్యూటీసీ ట్రోఫీని అందుకున్నాడు. అయితే ఆ తర్వాత అతని టెస్టు కెప్టెన్సీతోపాటు బ్యాటింగ్ కూడా గాడి తప్పింది. స్వదేశంలో బంగ్లా చేతిలో ఓటమి, ఇంగ్లండ్ గడ్డపై మూడు టెస్టుల్లో ఒక్కటి కూడా గెలవలేకపోవడం అతనిపై మరింత ఒత్తిడి పెంచాయి.

ఇదే సరైన సమయం..
'బ్లాక్ క్యాప్స్ జట్టుకు టెస్టు కెప్టెన్‌గా ఉండటం ఒక ప్రత్యేకమైన గౌరవం. అయితే కెప్టెన్సీ అనేది మరింత పనిభారంతో వస్తుంది. ఇది కేవలం మైదానంలోనే కాదు, మిగతా జీవితంపైనా భారం చూపుతుంది. అందుకే ఇప్పుడు నా కెరీర్‌లో ఈ నిర్ణయం తీసుకోవడం సరైంది అని అనుకుంటున్నా. న్యూజిల్యాండ్ క్రికెట్ బోర్డుతో చర్చించిన తర్వాత.. వచ్చే రెండేళ్లలో రెండు వరల్డ్ కప్‌లు ఉన్న నేపథ్యంలో కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే నేను కెప్టెన్‌గా కొనసాగాలని నిర్ణయించాం' అని విలియమ్సన్ వెల్లడించాడు.

తదుపరి కెప్టెన్ ఎవరంటే?
న్యూజిల్యాండ్ జట్టుకు టెస్టుల్లో తదుపరి కెప్టెన్‌గా వెటరన్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీని నియమిస్తున్నట్లు న్యూజిల్యాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. మరో సీనియర్ బ్యాటర్ టామ్ లాథమ్ ఈ జట్టుకు వైస్ కెప్టెన్‌గా కొనసాగుతాడని ప్రకటించింది. సౌథీ ఇంతకుముందు కూడా పలు సందర్భాల్లో న్యూజిల్యాండ్ జట్టుకు నాయకత్వం వహించాడు. గతంలో 22 టీ20 మ్యాచుల్లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అందుకే అతన్ని జట్టు 31వ టెస్టు కెప్టెన్‌గా నియమించాలని న్యూజిల్యాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది.


Click it and Unblock the Notifications












