మా వ్యూహం ఫలించింది కానీ విజయం దక్కలేదు.. జాసన్ హోల్డర్ పోరాటం అద్బుతం: కేన్ మామ

షార్జా: బౌలింగ్, ఫీల్డింగ్‌లో అద్భుతంగా రాణించినా బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించలేకపోయామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు ఇది 8వ ఓటమి. దాంతో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి. పిచ్ బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉండటంతో ఇరు జట్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాయి.

ఇక చేజింగ్‌లో ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోవడంతో సన్‌రైజర్స్ వ్యూహం మార్చింది. నెమ్మదిగా ఆడుతూ మ్యాచ్‌ను చివర వరకు తీసుకోవాలని భావించింది. జాసన్ హోల్డర్ విరోచిత ఇన్నింగ్స్‌తో ఈ వ్యూహం దాదాపు ఫలించింది. అయితే మ్యాచ్‌ను మాత్రం తృటిలో చేజార్చుకుంది.

హోల్డర్ పోరాటం సూపర్బ్..

హోల్డర్ పోరాటం సూపర్బ్..

ఇక మ్యాచ్ అనంతరం ఈ ఓటమిపై స్పందించిన కేన్ మామ.. బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి కారణమన్నాడు. జాసన్ హోల్డర్ ఒంటరి పోరాటం అద్భుతమని ప్రశంసించాడు. ఈ సీజన్ తమకు కలిసిరాలేదని, మంచి ఫ్లాట్‌ఫామ్ రూపొందించడానికి ఈ సీజన్ ఫస్టాఫ్‌ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నాడు. 'బౌలింగ్, ఫీల్డింగ్‌లో అద్బుత ప్రదర్శన కనబర్చాం. అయితే బ్యాటింగ్ చేయడానికి పిచ్ చాలా కఠినంగా ఉంది. దాంతో కావాల్సిన భాగస్వామ్యాలతో మ్యాచ్‌ను చివరివరకు తీసుకెళ్లాలనుకున్నాం. బ్యాటింగ్, బౌలింగ్‌లో జాసన్ హోల్డర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో అద్భుతంగా పోరాడాడు.

మెరుగై ప్రదర్శన ఇస్తాం..

మెరుగై ప్రదర్శన ఇస్తాం..

ఈ సీజన్ మాకు నిరాశనే మిగిల్చింది. ఏ మాత్రం కలిసిరాలేదు. కొన్ని విషయాల్లో మేం మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. ఫస్టాఫ్ సీజన్ నుంచి మేం నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లాట్‌ఫామ్ నిర్మించడం గురించి. ఇది సవాల్‌తో కూడుకున్నది. లీగ్‌లో ప్రతీ టీమ్ బలమైనదే. వాటికి అనుగుణంగా ప్రణాళికలతో సిద్దం కావాల్సిందే. తదుపరి మ్యాచ్‌ల్లో ఫ్రెష్‌గా, స్వేచ్చగా బరిలోకి దిగుతాం. మెరుగైన ప్రదర్శనను ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. మెరుగైన స్థానంలో నిలిచి లీగ్‌ను ముగిస్తాం'అని కేన్ మామ చెప్పుకొచ్చాడు.

 బౌలింగ్‌లో చెలరేగినా..

బౌలింగ్‌లో చెలరేగినా..

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవరల్లో 7 వికెట్లకు 125 పరుగులు మాత్రమే చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్(32 బంతుల్లో 2 ఫోర్లతో 27), కేఎల్ రాహుల్( 21 బంతుల్లో 3 ఫోర్లతో 21) టాప్‌సోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాట్స్‌మన్ అంతా దారుణంగా విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో జాసన్ హోల్డర్(3/19) పంజాబ్ కింగ్స్ పతనాన్ని శాసించగా.. సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, అబ్దుల్ సమద్ తలో వికెట్ తీశారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 120 పరుగులు మాత్రమే చేసింది. జాసన్ హోల్డర్, వృద్దిమాన్ సాహా(37 బంతుల్లో ఫోర్‌తో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో(3/24) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ(2/14) రెండు వికెట్లు తీశాడు. అర్షదీప్ సింగ్ ఓ వికెట్ పడగొట్టాడు. లో స్కోరింగ్ గేమ్ అయినా అభిమానులను ఆఖరి బంతి వరకు మునివేళ్లపై నిలబెట్టింది.

కొంపముంచిన బ్యాటింగ్ వైఫల్యం..

కొంపముంచిన బ్యాటింగ్ వైఫల్యం..

టాపార్డర్, మిడిలార్డర్ కట్టకట్టుకొని విఫలమవ్వడం సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయవకాశాలను దెబ్బతీసింది. జాసన్ హోల్డర్(29 బంతుల్లో 5 సిక్స్‌లతో 47 నాటౌట్) అండగా ఏ ఒక్కరు నిలబడ్డా ఫలితం మరోలా ఉండేది. పవర్ ప్లేలో వికెట్లు కాపాడుకున్నా.. పంజాబ్‌పై ఒత్తిడి నెలకొనేది. ముఖ్యంగా ఓపెనర్ డేవిడ్ వార్నర్ వైఫల్యంపై టీమ్‌పై తీవ్ర ప్రభావం చూపించింది.

చివర్లో హోల్డర్ ధాటిగా ఆడగా.. మరో ప్లేయర్ ఎవరూ కూడా అతనికి సహకరించలేదు. ఒక్క బౌండరీ కూడా బాదలేకపోయారు. క్రీజులో నిలబడిపోయిన సాహా సైతం స్వేచ్చగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. అర్ష‌దీప్ సింగ్ వేసిన 19వ ఓవర్‌ కూడా హైదరాబాద్ విజయవకాశాలను దెబ్బతీసింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, September 26, 2021, 0:20 [IST]
Other articles published on Sep 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X